సీక్రెట్ విషయాలన్నీ అలా బయటపెట్టేసింది.. పాయల్ రాజ్‌పుత్ టార్గెట్ అదేనట!

ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమా హీరోగా కార్తికేయను, దర్శకుడి అజయ్ భూపతిని, హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టింది. ఈ సినిమా తరువాత హీరోహీరోయిన్లు ఫుల్ బిజీ అయిపోయారు. వరుసబెట్టి సినిమాలను పట్టాలెక్కించారు. పాయల్ రాజ్‌పుత్‌కు ఏకంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే మళ్లీ ఆర్ ఎక్స్ 100 రేంజ్‌లో హిట్టు కొట్టలేకపోయింది. కానీ ఆమెకు వచ్చిన క్రేజ్‌ను మాత్రం అలానే నిలబెట్టుకుంది.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

ఆర్డీఎక్స్ లవ్, డిస్కోరాజా, వెంకీమామ వంటి సినిమాల్లో పాయల్ రాజ్‌పుత్ నటించినా అవేవీ కలిసి రాలేదు. వెంకీమామ సినిమా హిట్ అయినా గానీ పాయల్‌కు, ఆమె పాత్రకు ఒరిగిందేమీ లేదు. ఇలా సినిమాలేవీ కలసి రాకపోయినా సోషల్ మీడియా సాధనంతో పాయల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

లాక్‌డౌన్‌లో అలా..

లాక్‌డౌన్‌లో అలా..

లాక్‌డౌన్‌లో పాయల్ వింత వింత చాలెంజ్‌లు విసిరింది. పిల్లో ఛాలెంజ్, పేపర్ డ్రెస్సులు అంటూ అందాలకు అడ్డుకట్ట పెట్టిన ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది. హాట్ హాట్ ఫోటోలతో, ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూ వార్తల్లోకి ఎక్కేది. ఇక ఈ అమ్మడిపై రూమర్స్ కూడా బాగానే వస్తుండేవి.

 ప్రత్యేక పాత్రల్లో..

ప్రత్యేక పాత్రల్లో..

లాక్ డౌన్ సమయంలోనే పాయల్ సినిమా కథలు వింటోందని, వాటి గురించి చర్చలు జరుపుతోందని రూమర్స్ వినిపించాయి. పుష్ప, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించనుందని వార్తలు వచ్చాయి. అలాంటి వాటిపై పాయల్ సీరియస్ అయి వాటిని ఖండించింది. ఏదైనా ఉంటే తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపింది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
అన్నీ బయటపెట్టేసింది..

అన్నీ బయటపెట్టేసింది..

ఇక తాజాగా పాయల్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటూ బాగా తిన్నట్టుంది.. బరువు చాలా పెరిగానని చెప్పుకొచ్చింది. 62 కేజీల వరకు పెరిగాను .. ఇప్పుడు 58.5 వరకు తగ్గాను. కానీ నా టార్గెట్ 52 కేజీలు అంటూ తన కష్టాలను చెప్పుకొచ్చింది. మామూలుగా అమ్మాయిలు వయసు, బరువు విషయాలను చెప్పడానికి మొహమాటపడతారు. కానీ పాయల్ మాత్రం పూసగుచ్చినట్టు అన్నీ చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X