అలా ముద్దులు కురిపిస్తోంది.. ముంబైకి బయల్దేరిన పాయల్
పాయల్ రాజ్‌పుత్ హైద్రాబాద్‌లోనే సెటిలైంది. ఇక్కడే ఓ ఇళ్లు కూడా కొనేసిందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పాయల్ చేస్తున్న రచ్చ అందరికీ తెలిసిందే. రోడ్లపైనే ఫోటో షూట్లు చేస్తూ హల్చల్ చేసింది. ఆర్ ఎక్స్ 100తో దుమ్ములేపిన ఈ బ్యూటీ.. ఆ తరువాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే మళ్లీ ఆ రేంజ్ సక్సెస్‌ను మాత్రం చూడలేకపోతోంది. ఇక తాజాగా హైద్రాబాద్‌కు మకాం మార్చిన పాయల్.. ఫుల్ జోష్‌లో ఉంది.
తాజాగా ఈ భామ ప్రభుత్వ ప్రకటనల్లో నటించిందని తెలుస్తోంది. ఈ మేరకు అందులో తన పాత్రకు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నట్టు పేర్కొంది. ఇకపై తన సినిమాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని తెలిపింది. ఇక్కడే ఓ ఇళ్లు కొనుక్కున్నానని, సామాన్లు కొందామని షాపింగ్‌కు వెళ్తే జనాలు చుట్టు ముట్టేస్తున్నారని తెలిపింది. అందుకే వాటిని ఆన్ లైన్‌లోనే ఆర్డర్ ఇచ్చుకుంటున్నానని వెల్లడించింది.


అయితే ఈ భామ మళ్లీ ముంబై పయనమైంది. అసలే ఇప్పుడు ప్రయాణాలంటే ఎన్ని జాగ్రత్తలు, ఎంత పకడ్బంధీగా వెళ్లాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. పీపీఈ కిట్స్ ధరించి, ఫేస్ షీల్డ్ పెట్టుకుని ఎయిర్ పోర్ట్‌లో పాయల్ సందడి చేసింది. ఇక ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ ముద్దులన్నీ తమకే అన్నట్టుగా నెటిజన్లు సంబరపడిపోయారు.అయితే ఈ ఒక్క రోజు కోసమే పాయల్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











