ఎద అందాలతో వల.. పాయల్ రాజ్‌పుత్ వీడియో వైరల్
ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వెండితెరపై ఎంతగా అందాలను ఆరబోస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా అందాలను ప్రదర్శిస్తుంటుంది. అయితే తాజాగా పాయల్ ఓ ఫోటో షూట్‌ను చేసింది. అందులో తన ఎద అందాలను భారీగానే ప్రదర్శించింది. మామూలుగానే పాయల్ ఎప్పుడూ కూడా హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట్లో సెగలు పుట్టిస్తూ ఉంటుంది.

పాయల్ అలా..
ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందు పాత్రలో పాయల్ నటన అదిరిపోయింది. ఆ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులు పాట అందరూ కూడా ఇందు మాయలోంచి బయటకు రాలేకపోయారు. అలా మొదటి సినిమాతోనే పాయల్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమానే తెలుగులో అలా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

సక్సెస్ మాత్రం..
పాయల్ రాజ్‌పుత్‌కు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన హిట్ కొట్టలేకపోయింది. అయితే చివరగా అనగనగా ఓ అతిథి అనే చిత్రంతో మంచి నటనను కనబర్చింది. కానీ ఆ సినిమా ఓటీటీకే పరిమితమైంది.

లాక్డౌన్‌లో అలా..
పాయల్ రాజ్ పుత్ లాక్డౌన్‌లో ఎలా సందడి చేసిందో అందరికీ తెలిసిందే. వెరైటీ చాలెంజ్‌లు విసురుతూ అందాలను ఆరబోసింది. పిల్లో చాలెంజ్, పేపర్ డ్రెస్సులను ధరిస్తూ పాయల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందాలను ఆరబోయడంలో పాయల్ ఎప్పుడూ వెనుకడుగు వేయదు.

తాజాగా ఇలా..
పాయల్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె వేసిన అందాల ఎరకు కుర్రకారు చిక్కేట్టు కనిపిస్తున్నారు. ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టేయండి.. నేను మీ ముందుంటాను అంటూ తన అభిమానులను కొంటెగా కవ్వించింది.


Click it and Unblock the Notifications











