పవర్‌స్టార్ సెన్సేషన్: వచ్చి వెళ్లాలంటే రూ. కోటి ఖర్చు.. పవన్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి..!

By Manoj Kumar P

పవన్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు. చిరంజీవి సోదరుడిగా సినిమా రంగ ప్రవేశం చేసినప్పటికీ.. తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సినిమాలను పక్కన పెట్టేశాడు. ఇక, కొద్ది రోజుల్లో మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అవబోతున్నారు. తాజాగా దానికి సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?

సినిమాల్లోకి రానన్నా.. సెట్ చేసేశాడు

సినిమాల్లోకి రానన్నా.. సెట్ చేసేశాడు

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇకపై సినిమాల్లోకి రానని చాలా సందర్భాల్లో వెల్లడించాడు. అయినప్పటికీ.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్‌తో రీఎంట్రీ ఇప్పిస్తున్నాడు. ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ప్రయత్నించినా సాధ్యం కాని దానిని ఈయన చేసి చూపించాడు. దీంతో త్వరలోనే ఈ మెగా హీరో ముఖానికి మేకప్ వేసుకుని కనిపించబోతున్నాడు.

 అన్ని ఫిక్స్ అయ్యాయి.. అదే మిగిలింది

అన్ని ఫిక్స్ అయ్యాయి.. అదే మిగిలింది

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాతోనే పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఈ మూవీని దిల్ రాజుతో పాటు బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. దీనికి ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఒక్కటే ప్రారంభం కావాల్సి ఉంది.

పవన్‌ను పరీక్షించారు.. ఫొటోలు లీక్ చేశారు

పవన్‌ను పరీక్షించారు.. ఫొటోలు లీక్ చేశారు

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్టుకు పవన్ కల్యాణ్ హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరిగిన దీనికి ఆయన ఓ రెండు గంటల సమయం కేటాయించాడని తెలిసింది. నేచురల్ లుక్‌తో ఆయన నడిచి వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిని చూసిన మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

సినిమా చేయాలంటే వాటికి ఒప్పుకోవాల్సిందే

సినిమా చేయాలంటే వాటికి ఒప్పుకోవాల్సిందే

ఈ సినిమాలో నటించేందుకు పవన్ కల్యాణ్.. నిర్మాత దిల్ రాజు ముందు చాలా కండీషన్లు ఉంచాడని గతంలో వార్తలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం.. ఈ సినిమాకు ఆయన రూ. 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అలాగే, ఈ సినిమా కోసం మొత్తంగా 21 రోజులు మాత్రమే కేటాయించారని ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకుడు వేణుపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు.

పవన్ వచ్చి వెళ్లాలంటే రూ. కోటి ఖర్చు

పవన్ వచ్చి వెళ్లాలంటే రూ. కోటి ఖర్చు

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌కు పవన్ ప్రత్యేక విమానంలో వచ్చి వెళ్లనున్నాడట. ఇందుకోసం నిర్మాత దిల్ రాజు రూ. కోటి కేటాయించారని సమాచారం. దీంతో పవన్ రేంజ్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

Can Pawan Kalyan Manage His Work ? | PSPK 26 | Janasena | Amaravati
పవన్ స్పందించలేదు.. ప్రారంభించాడు

పవన్ స్పందించలేదు.. ప్రారంభించాడు

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో నిర్మాత దిల్ రాజు దీనికి బలం చేకూర్చే స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉన్నారు. కానీ, పవన్ మాత్రం స్పందించలేదు. అయితే, ఆయన ఏకంగా సినిమా కోసం పని చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X