అరవింద సమేతపై పైరసీ దెబ్బ.. వెబ్‌సైట్లో పూర్తి సినిమా.. డిస్టిబ్యూటర్లలో ఆందోళన
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. హారిని అండ్ హాసిని క్రియేషన్స్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలిసారి ఎన్టీఆర్, పూజాహెగ్గే జంటగా రూపొందిన అరవింద సమేత చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు ముగియక ముందే అరవింద సమేత చిత్రం పైరసీ కోరల్లో చిక్కుకోవడం డిస్టిబ్యూటర్లలో ఆందోళన మొదలైంది. వివరాల్లోకి వెళితే..

నిర్మాత రాధాకృష్ణ రిక్వెస్ట్
అరవింద సమేత చిత్రం రిలీజ్‌కు ముందే చిత్ర యూనిట్ పైరసీని అడ్డుకొనేందుకు చర్యలు తీసుకొన్నది. నిర్మాత ఎస్ రాధాకృష్ణ రిలీజ్‌కు ముందే ట్వీట్ చేశారు. అరవింద సమేత చిత్రాన్ని వీడియో గానీ, ఫొటోలు తీయడం గానీ చేయవద్దు. ఒకవేళ అలా చేస్తే వారి అకౌంట్లు సస్పెండ్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం డేగ కన్ను వేసింది అని రాధాకృష్ణ ట్వీట్‌లో పేర్కొన్నారు.

షాక్‌కు గురైన చిత్ర యూనిట్
అరవింద సమేత చిత్ర యూనిట్ హెచ్చరికలను బేఖాతరు చూస్తూ ఈ సినిమా మొత్తం టొరెంట్స్ సైట్లలో ప్రత్యక్షమైంది. పూర్తి సినిమాను వివిధ వెర్షన్లలో డౌన్‌లోడ్ చేసుకొనే వెసలుబాటును కూడా ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ షాక్ గురైంది.

టొరెంటోలో అరవింద అప్‌లోడ్
అరవింద సమేత మొదటి ఆట పూర్తయిన తర్వాత సినిమా మొత్తాన్ని టొరెంటో సైట్లో అప్‌లోడ్ చేశారు. ఏదో సినిమా హాల్‌లో ప్రదర్శించేటప్పుడు అరవింద సమేతను షూట్ చేసినట్టు స్పష్టమైంది. దీంతో మరోసారి చిత్ర యూనిట్ రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది.

తొలి రోజు భారీ కలెక్షన్లు
అరవింద సమేత చిత్రం సుమారు రూ.60 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు సుమారు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించడానికి అవకాశం ఉందనే అంచనాను ట్రేడ్ అనలిస్టులు వేస్తున్నారు.

అరవింద ఆదాయానికి గండి
అరవింద సమేత చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు రూ.92 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే డిస్టిబ్యూటర్లకు సుమారు రూ.30 కోట్ల మేర లభించే అవకాశం ఉంది. టొరొంటోలో ఈ చిత్రం లీక్ కావడం వల్ల రానున్న రోజుల్లో ఆదాయానికి గండిపడే అవకాశం లేకపోలేదు.


Click it and Unblock the Notifications











