పవన్ గెలిస్తే.. నా భర్త రిక్షా తొక్కిన డబ్బుతో ఊరందరికి పార్టీ.. పిఠాపురం మహిళకు బేబీ నిర్మాత బంపర్ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అభిమానులు, ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజించారు. కేవలం పిఠాపురం, గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రా వ్యాప్తంగా జనసేన అధినేతపై వెలకట్టలేని ప్రేమను వ్యక్తికరించారు. పిఠాపురం మొత్తం ఏకతాటిపైకి వచ్చి జనసైనికుడికి నీరాజనం పట్టారు. అయితే తాజాగా పిఠాపురానికి చెందిన ఆటో డ్రైవర్ చెప్పిన మాటల వీడియో ట్రెండింగ్‌లో వచ్చింది. ఆమె చెప్పిన మాటలకు ఫిదా అయిన నిర్మాత ఎస్‌కేఎన్ ప్రేమగా భారీ బహుమతిని ప్రకటించారు. ఆ బహుమతి, ఆటో డ్రైవర్ గురించిన వివరాల్లోకి వెళితే..

పిఠాపురంలో కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను గుండెల్లో పెట్టుకొన్నారు. ఆయన నుంచి డబ్బు తీసుకోకుండా ఓటు వేసేందుకు సిద్దపడ్డారు. ప్రజల అండతో వార్ వన్ సైడ్ అనే విధంగా తీర్పును చెప్పడానికి సిద్దమయ్యారు.

Pithapuram Women voter party Video about Pawan Kalyan Win goes trending Baby Producer SKN bumper offer for Rikshaw Puller wife

అయితే పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత అంటూ లేచి డ్యాన్స్ చేసింది. బాబు.. నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరందరికి పార్టీ ఇస్తాను అంటూ తన అభిమానాన్ని చాటుకొన్నది.

అయితే పవన్ కల్యాణ్‌పై అంచెంచలమైన, నిస్వార్ధమైన ప్రేమను కురిపించిన రిక్షా పుల్లర్ భార్యపై బేబీ నిర్మాత ఎస్కేఎన్ తన తరఫున భారీ నజరానా ప్రకటించారు. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు ఆటో కొని.. గిఫ్టుగా ఇస్తాను. నా ఫేవరేట్ హీరో, లీడర్‌పై నిజాయితీతో కూడిన ప్రేమను కురిపించిందుకు అంటే ఎస్కేఎన్ ట్వీట్ చేశారు.

Pithapuram Women voter party Video about Pawan Kalyan Win goes trending Baby Producer SKN bumper offer for Rikshaw Puller wife

ప్రస్తుతం రిక్షా నడిపే వ్యక్తి భార్య చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. విపరీతంగా షేర్లు కొడుతున్నారు. వేల మంది లైక్ చేస్తున్నారు. ఇక నిర్మాత ఇచ్చిన హామీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X