క్యారవాన్‌లో అలాంటి పనులు.. గుట్టుగా వీడియో తీసిన పూజా హెగ్డే
పూజా హెగ్డే బుట్టబొమ్మగా టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చేసుకుంది. అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే రేంజ్ మారిపోయింది. పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడంతో గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయింది. మహర్షి, రంగస్థలం, గద్దలకొండ గణేష్, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా ప్రతీ ఒక్క సినిమా సూపర్ హిట్ అవుతూనే వచ్చింది.

లక్కీ గాళ్ అంటూ..
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసినా, కనిపించినా కూడా సినిమా హిట్ అని తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెంటిమెంట్ వచ్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ఆఫర్లను పూజా తన ఖాతాలో వేసుకుంటోంది.

రాధేశ్యామ్, బ్యాచ్‌లర్ అంటూ..
మామూలుగా అయితే పూజా హెగ్డే రాధేశ్యామ్, బ్యాచ్‌లర్ సినిమాలతో ముందుగా ప్రేక్షకులను పలకరించాల్సింది. కానీ మధ్యలో ఆచార్య ఆఫర్ రావడంతో అంతా తారుమారైంది. అలా రాధేశ్యామ్ కంటే ముందుగానే ఆచార్య సినిమాతో పూజా హెగ్డే పలకరించబోతోంది.

ఆచార్యలో చెర్రీ సరసన..
ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ద పాత్రలో కనిపించబోతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించబోతోంది. ఈ మధ్యే మారెడు మిల్లి అటవీ ప్రాంతంలో పూజా హెగ్డే ఆచార్య షూటింగ్‌ను చేయగా.. అందులో పూజా హెగ్డే పాల్గొంది.

తాజాగా అలా..
అయితే తాజాగా పూజా హెగ్డే తన వానిటీలో జరుగుతున్న ఓ ఫన్నీ సంఘటన గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. తన సోదరుడు రిషబ్ హెగ్డే ఏదో సలహాలు ఇస్తుండటం, ఆర్దోపిడీషియన్ ఫ్రీగా సలహాలు ఇస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. తన తమ్ముడు అలా కొన్ని సలహాలు, ఎక్సర్ సైజ్ ఎలా చేయాలో చెబుతున్నాడంటూ పూజా హెగ్డే తెలిపింది. ఈ మధ్యే తన సోదరుడు డాక్టర్ పట్టాను పొందిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











