For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రూమ్‌లోనే ఇరుక్కుపోయిన పూజాహెగ్డే ఫ్యామిలీ.. సాయం కోసం హీరోయిన్ తండ్రి కేకలు

  |

  టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముకుంద చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ముగ్దుల్ని చేసేసింది. ఆపై బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. డీజే సినిమాతో అదిరిపోయేలా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పూజాకు లక్కు బాగా కలిసి వచ్చింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోల పక్కన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను సొంతం చేసుకుంది. చివరగా అల వైకుంఠపురములో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ లాక్‌డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పూజా హెగ్డేకు ఓ చిన్న పాటి కష్టం వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటో ఓ సారి చూద్దాం.

  లాక్‌డౌన్‌లో టాలెంట్‌కు మెరుగులు..

  లాక్‌డౌన్‌లో టాలెంట్‌కు మెరుగులు..

  క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపే స్టార్ హీరోయిన్లకు కరోనా పుణ్యమా అని రెండు నెలలు ఖాళీగా ఇంటి పట్టునే ఉన్నారు. ఈక్రమంలో కొంతమంది తమ ప్రతిభకు మెరుగులు దిద్దారు. ఈక్రమంలో పూజా హెగ్డే సైతం వంట వండటంలోని చిట్కాలు, గిటార్ వాయించడంలోని మెలుకువలను నేర్చుకుంటోంది.

  ఫ్యామిలీతో సరదాగా..

  ఫ్యామిలీతో సరదాగా..

  షూటింగ్స్ అంటూ నిత్యం పరుగెత్తే హీరోయిన్స్.. ఈ ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. పూజా హెగ్డే సైతం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సోదరుల చేత సేవలు చేయించుకుంటూ ఉన్న పూజా వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తన తండ్రి బర్త్ డేను కూడా ఉన్నంతలో సొంతంగా కేక్ తయారుచేసి ఘనంగా సెలెబ్రేట్ చేసింది.

  సెల్ఫీలతో హల్చల్..

  సెల్ఫీలతో హల్చల్..

  ఇక పూజాకు ఈ క్వారంటైన్‌లో ఉన్న మరో పని సెల్పీలు దిగడం. ఆ మధ్య పూజా షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. బుక్స్ చదవడం, అప్పుడప్పుడు ఇలా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం పూజా దినచర్యగా మారింది.

  రూమ్ డోర్ లాక్ కావడంతో..

  రూమ్ డోర్ లాక్ కావడంతో..

  తాజాగా పూజా హెగ్డే తన ఫ్యామిలీతో ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని రూమ్ డోర్ లాక్ అయింది. ఇక ఆ రూమ్ డోర్‌ను తీయడానికి పూజా హెగ్డే తల్లి తెగ ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు క్రెడిట్, యాక్సిస్ కార్డులను ఉపయోగించి నానాతంటాలు పడింది.

  Prabhas20 Title And First Look In May ! Movie Makers Over Fans Trolls
  హెల్ప్ అంటూ కేకలు..

  హెల్ప్ అంటూ కేకలు..

  ఇక అలా చేస్తే ఉపయోగం లేదనుకున్న పూజా హెగ్డే తండ్రి.. కిటికీని తెరిచి హెల్ప్ హెల్ప్ అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. చివరకు డోర్‌కు చిన్న రంధ్రం చేసి తెరిచినట్టు పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. మొత్తానికి గండం గట్టెక్కడంతో పూజా తెగ సంబరపడిపోయింది.

  English summary
  Pooja Hegde And Her family Stuck Into Room. Her Apartment Room Door Was Locked And They Tried So Much To OPen The Door With The Help Of Cards.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X