ప్రేయసిని పరిచయం చేసిన ప్రభాస్.. డార్లింగ్‌లో ‘ప్రేరణ’ కలిగించేలానే ఉంది!
బాహుబలి లాంటి ప్రభాస్‌ను ప్రేమలో దించాలంటే బుట్టబొమ్మలాంటి పూజా హెగ్డేనే కరెక్ట్. అందుకే రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా అయిన రాధేశ్యామ్ కథలో ప్రభాస్‌కు సరైన జోడిగా పూజా హెగ్డేను ఎంచుకున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ఆ మధ్య రాధేశ్యామ్ అంటూ టైటిల్ రివీల్ చేసినప్పుడో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మళ్లీ ఇంత వరకు ఒక్క పోస్టర్‌గానీ, అప్డేట్ గానీ ఇవ్వలేదు. తాజాగా పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

సెప్టెంబర్ చివరి వారంలో..
కరోనా దెబ్బకు రాధే శ్యామ్ షెడ్యూల్ మొత్తం రివర్స్ అయింది. అసలే షూటింగ్ ఆలస్యం అవుతూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సెప్టెంబర్ చివరి వారంలోనే టీం మొత్తం ఇటలీ బయల్దేరింది. అక్కడే ఓ నెల పాటు షూటింగ్ నిర్వహించబోతోందని సమాచారం.

ఇద్దరి బర్త్ డేలు అక్కడే..
ఇదే విషయాన్ని పూజా హెగ్డే చెబుతూ.. ఇక ఇద్దరి బర్త్ డేలు అక్కడే జరుపుకోవచ్చని తెలిపింది. తన బర్త్ డే (అక్టోబర్ 13), ప్రభాస్ (అక్టోబర్ 23) బర్త్ డేలను అక్కడే సెలెబ్రేట్ చేసుకుంటామని పూజా చేసిన ట్వీట్‌తోనే రాధేశ్యామ్ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అలా అక్టోబర్ మొదటి ప్రారంభం నుంచి ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ మొదలైంది.

బర్త్ డే ట్రీట్..
పూజా హెగ్డే బర్త్ డే నేడు. ఈక్రమంలో చిత్రయూనిట్ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేసింది యూనిట్. రాధేశ్యామ్‌లో పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో కనిపించబోతోంది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌ను పూజా నవ్వును చూస్తే ఎవరి మనసులోనైనా ప్రేరణను కలిగించేలానే ఉంది.

ప్రభాస్ పోస్ట్..
పూజా హెగ్డే బర్త్ డే సందర్బంగా ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ప్రభాస్ రిలీజ్ చేశాడు. మన ప్రేరణకు హ్యాపీ బర్త్ డే అంటూ పూజా పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇక ప్రభాస్ లాంటి వాడిని పడగొట్టాలంటే ప్రేరణ లాంటి అమ్మాయి, ఆ నవ్వు కావాల్సిందే అనేట్టుగా పూజా హెగ్డే ఉంది.
Recommended Video

ప్రభాస్ బర్త్ డే స్పెషల్..
ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ రానుందని తెలుస్తోంది. రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే టీజర్ ఒకటి రెడీ అవుతోందట. బర్త్ డే కానుకగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రాధేశ్యామ్ టీం రెడీ అవుతోందట.


Click it and Unblock the Notifications











