బుల్లి అభిమానిని కలవాలని ఆశగా ఉందట.. ఆ వీడియో చూసి గాల్లో తేలిపోయిన పూజా హెగ్డే
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ముకుంద సమయంలో పూజా హెగ్డేకు ఉన్న ఫేమ్.. ఇప్పుడున్న క్రేజ్‌కు అలసు పొంతనే లేదు. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతోంది. వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతూ టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. అయితే పూజా హెగ్డే చుట్టూ ఎంత పాజిటివిటీ ఉందో అంతేస్థాయిలో నెగెటివిటీ కూడా ఉంది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

వివాదాలతో పూజా..
లాక్డౌన్‌లో పూజా హెగ్డే సమంతపై చేసిన కామెంట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. సమంత ఏమీ అంత క్యూట్‌గా లేదు అని మజిలీ సినిమా చూస్తూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తన అకౌంట్ హ్యాక్ అయిందని యూటర్న్ తిరిగిన సంగతి కూడా తెలిసిందే.

తాజాగా దక్షిణాదిపై..
దక్షిణాది వారికి నడుముపై ధ్యాస ఉంటుంది. అది చూపిస్తే చాలు. సౌత్ సినిమా వాళ్లు నడుము వ్యామోహంలో ఉంటారు. అంతేకాకుండా మిడ్ డ్రెస్‌లలో తమను చూడాలనుకుంటారని పూజా చెప్పుకొచ్చింది. అల వైకుంఠపురములో తన కాళ్లను చూపించారని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి.

ప్రాణసమానం..
సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న నెగెటివ్ వార్తలపై పూజా హెగ్డే ఓ ప్రకటనను జారీ చేసింది. ‘నేను ఒక ఇంటర్వూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా.. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. మీరు మొత్తం ఇంటర్వ్యూను చూడండి' అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
బుల్లి అభిమాని..
తాజాగా పూజా హెగ్డే తన బుల్లి అభిమానిని చూసి ఫిదా అయింది. పెద్దయ్యాక హీరోయిన్ అవుతాను..పూజా హెగ్డే అంటే ఇష్టం..పూజా హెగ్డేలా అవుతాను.. హీరోయిన్ పూజా హెగ్డేలా అవుతాను అని ఓ చిన్నారి చెప్పుకొచ్చింది. ఈ వీడియోను చూసిన పూజా హెగ్డే తెగ సంతోషపడింది.

బుగ్గలు ఎంత బాగున్నాయో..
ఆ వీడియోను షేర్ చేస్తూ సదరు అభిమానిని కలవాలన్న కోరికను బయట పెట్టింది పూజా హెగ్డే. ఓఎంజీ.. అంటూ ఆ అభిమానిని చూసి ఆశ్చర్యపోయింది. ఈ వీడియోతో నారోజు మొత్తం సంతోషంగా గడుస్తుంది.. ఈ బుగ్గలు ఎంత బాగున్నాయో.. ఇలా మెసెజ్‌లోనే నీకు ప్రేమను, ముద్దులను పంపుతున్నాను అని చెప్పుకొచ్చింది


Click it and Unblock the Notifications











