టాలీవుడ్ యువ హీరోకు పూజా హెగ్డే బహుమతి.. ఆ గిఫ్టు ఎమిటి? ఏ హీరోకు పంపించారంటే!
అందాల తార పూజా హెగ్డే కరోనావైరస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. తన ఆరోగ్యంపై దృష్టి పెడుతూనే మరోవైపు కరోనావైరస్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా తనకు సన్నిహితులు, స్నేహితులకు ఫీల్‌గుడ్ నోట్‌తో గిఫ్టులు కూడా పంపారు. ఇటీవల టాలీవుడ్ యువ హీరోకు పూజా హెగ్డే ఎలాంటి గిఫ్ట్ పంపారంటే..
బెడ్రూం సీన్లలో హాట్ హాట్‌గా అదితి .. ఎలాంటి జంకు లేకుండా యువ తార అలా..

2020లో బ్లాక్‌బాస్టర్‌గా అల వైకుంఠపురంలో
లాక్‌డౌన్‌కు ముందు పూజా హెగ్డే నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. 2020లో బ్లాక్‌బాస్టర్‌గా మారిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తోపాటు సుశాంత్ కూడా నటించారు. ఈ సినిమా షూటింగులో స్నేహితుడిగా మారిన సుశాంత్‌తో మంచి రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్నారు. వారిద్దరికి కామన్ ఫేవరేట్ టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ కావడంతో ఇద్దరు మరింత క్లోజ్ అయ్యారు. అలా ఎస్టాబ్లిష్ అయిన స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని సుశాంత్‌కు చిరు బహుమతిని పంపించారు.

సుశాంత్ కోసం మామిడిపండ్లు బుట్ట
సుశాంత్ కోసం మామిడి పండ్ల బుట్టను గిఫ్ట్ ప్యాక్‌గా పంపించారు. ఆ గిఫ్టుతోపాటు ఓ లేఖను కూడా రాసి పంపారు. స్వదస్తూరితో రాసిన లేఖలో ప్రియమైన ఫెదరర్ ఫ్యాన్ అంటూ సంభోధించింది. నీవు, నీ ఫ్యామిలీ అంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను అంటూ లేఖలో కుశల ప్రశ్నలు వేశారు.

నీ కోసం ఆర్గానిక్ మ్యాంగోస్
సుశాంత్ నీకు.. ఇష్టమైన మామిడి పండ్లను నీ కోసం పంపిస్తున్నాను. నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ నుంచి మంచి రుచికరమైన ఆర్గానిక్ మ్యాంగోస్ తెప్పించి పంపించా. ఈ మామిడి పండ్లు మధురమైన రోజుగా నీకు మారుస్తుందని ఆశిస్తున్నాను. వాటిని తింటూ ఎంజాయ్ చేసి ఉంటావనుకొంటున్నాను. డోంట్ వరీ.. అవి జీరో కేలరీస్.. మ్యాజికల్ మ్యాంగోస్ అంటూ లేఖలో తెలిపారు.

పూజాహెగ్డేకు థ్యాంక్స్ చెప్పిన సుశాంత్
పూజా హెగ్డే పంపిన గిఫ్ట్‌పై ట్విట్టర్‌లో సుశాంత్ స్పందించారు. థ్యాంక్యూ సో మచ్. ప్లీజ్. లవ్లీ సర్‌ప్రైజ్, మీరు పంపిన గిఫ్టుతో నా రోజు కచ్చితంగా మధురమైన రోజుగా మార్చింది. ముఖ్యంగా మా అమ్మకు చాలా నచ్చాయి అంటూ సుశాంత్ ట్వీట్ చేశారు. అయితే సుశాంత్... నీవు ఫెదరర్ ఫ్యాన్ అనే విషయం మాకు తెలియదు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video

సుశాంత్, పూజా హెగ్డే కెరీర్
ఇక సుశాంత్, పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. సుశాంత్.. ఇక్కడ వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే తాజాగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. బాలీవుడ్‌లో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
అంతేకాకుండా ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న Thalapathy 65 చిత్రంలోను, అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో కూడా నటించేందుకు ఒకే చెప్పారు.


Click it and Unblock the Notifications











