పూజాహెగ్డే వ్యవహారం సమంతను బాధ పెట్టిందా?.. ఆ పోస్ట్ అర్థం అదే!
గత రెండు రోజులుగా సమంత పూజా హెగ్డే వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంతను అందంగా లేదని పూజా హెగ్డే కామెంట్ చేయడం.. ఆపై తన అకౌంట్ హ్యాక్ అయిందని ప్రకటించిడం వంటి విషయాలు తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయంలో సమంత, నందినీ రెడ్డి, సింగర్ చిన్మయి ఎంటర్ కావడం, పూజాకు మద్దతు పెరగడం ఇవన్నీ తెగ హల్చల్ చేశాయి. ఈ వ్యవహారం అంతా సమంతను బాగానే బాధ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సమంత చెప్పిన ఓ కొటేషన్ తెగ వైరల్ అవుతోంది.

పూజా హెగ్డే కామెంట్స్..
మజిలీ చిత్రాన్ని వీక్షించిన పూజా హెగ్డ .. ఏ కోశాన కూడా నాకు సమంత అందంగా కనిపించడం లేదు అని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ క్షణాల్లో వైరల్ అయింది. కొద్దిసేపటికే తన అకౌంట్ హ్యాక్ అయిందని పూజా హెగ్డే పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్..
సమంతను అందంగా లేదని కామెంట్ చేసిన పూజా హెగ్డేపై ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నారు. అంద విహీనంగా ఉన్న పూజా హెగ్డే ఫోటోలను షేర్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. సమంతకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.

వారి ఎంట్రీతో..
సమంతకు మద్దతుగా నందినీ రెడ్డి, చిన్మయి ఎంటర్ అవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ ముగ్గురు కలిసి పూజా హెగ్డేపై పరోక్షంగా సెటైర్స్ వేయడంతో ఆమెకు మద్దతు పెరిగిపోయింది. దీంతో వీ సపోర్ట్ పూజా హెగ్డే అని హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు.
Recommended Video

మంచి తనంతో సమస్యలు..
అయితే నిన్న విక్టరీ సింబల్‌ను షేర్ చేసిన సమంత ఫ్యాన్స్‌లో పాజిటివిటీని పెంచింది. అయితే నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్‌ను షేర్ చేయడంతో బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. మంచితనం, మంచి హృదయం ఉంటే సమస్యలు వస్తాయ్.. మనల్ని అవతలివారు పిచ్చొళ్ల కింద జమకడతారు అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











