హ్యాకింగ్ అంటూ దొంగ నాటకాలు.. సమంతకు క్షమాపణలు చెప్పాల్సిందే.. పూజా హెగ్డేపై నెటిజన్స్ ఫైర్

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిందని స్వయంగా ట్వీట్ చేసి చెప్పడం, మళ్లీ ఓ గంట తరువాత అంతా సర్దుకుందని చెప్పడం అంతా వైరల్ అయింది.అయితే ఇది కేవలం పూజా హెగ్డే వర్షన్. దీని వెనకాల ఓ పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్‌స్టా స్టోరీలో సమంతపై చేసిన కామెంట్స్ మూలానే ఈ రచ్చ అంతా మొదలైంది. ఆ కామెంట్ వల్ల జరిగే పర్యవసానలను గమనించే.. ఇలా హ్యాకింగ్ అంటూ నాటకాలు మొదలుపెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు కథ ఏంటో ఓ సారి చూద్దాం.

పూజా హెగ్డే కామెంట్స్..

పూజా హెగ్డే కామెంట్స్..

పూజా హెగ్డే మజిలీ చిత్రాన్ని వీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ సీన్‌కు సంబంధించిన సమంత లుక్‌ను పోస్ట్ చేస్తూ.. ఏ కోశాన కూడా నాకు సమంత అందంగా కనిపించడం లేదు అని పేర్కొంది. అయితే ఇది తన స్టోరీలో పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే హ్యాకింగ్ అంటూ నాటకం మొదలుపెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

 అందుకే హ్యాకింగ్ నాటకం..

అందుకే హ్యాకింగ్ నాటకం..

సమంత మీద చేసిన కామెంట్స్ వల్ల ముప్పు వస్తుందని భావించిన పూజా హెగ్డే హ్యాకింగ్ అంటూ నాటకం ఆడి ఉంటుందని అందుకే ముందు జాగ్రత్తగా ట్విట్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని ప్రకటించింది.

గంటలోపే రికవరీ..

గంటలోపే రికవరీ..

అయితే ఈ తరహా నాటకాలు ఇంతకు ముందు ఎందరో వేశారు. చేయాల్సిన కామెంట్స్ చేసేసి.. ఆపై తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, ఆ కామెంట్స్ తాము చేయలేదని వివరణ ఇచ్చుకుంటారు. పూజా హెగ్డే కూడా ప్రస్తుతం అలానే చేసిందని సమంత అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు..

ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు..

సమంతను అందంగా లేదని కామెంట్ చేసిన పూజా హెగ్డేపై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. పూజా హెగ్డేపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నారు. గతంలో అంద వికారంగా ఉన్న పూజా హెగ్డే ఫోటోలను షేర్ చేస్తూ ఆమె పరువుతీస్తున్నారు. అనాల్సిన మాటలు అనేసి.. ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నావా?అంటూ ఫైర్ అవుతున్నారు.

Recommended Video

Pooja Hegde Controversial Post On Samantha, She Claims That Her Account Got Hacked
సమంత విక్టరీ సింబల్..

సమంత విక్టరీ సింబల్..

సోషల్ మీడియాలో ఇంతలా గొడవ జరుగుతూ ఉంటే సమంత మాత్రం సింపుల్‌గా చంద్రబాబు సిగ్నేచర్ మూమెంట్ విక్టరీ సింబల్‌ను పోస్ట్ చేసింది. సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాల్సిందేనని హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పటికీ సమసి పోతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X