సెగ గట్టిగానే తగిలినట్టుంది.. నడుము వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన పూజా హెగ్డే

మంచి క్రేజ్, ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు హీరోయిన్లకు వివాదాలు చుట్టుముడితే కాస్త కష్టమే అవుతుంది. హీరోయిన్లు కావాలని వివాదాలు క్రియేట్ చేసుకుంటే ఓ ఇమేజ్ వస్తుంది.. వేరేవారి వల్ల వివాదాల్లో చిక్కుకుంటో మరో రకమైన ఇమేజ్ వస్తుంది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. కానీ వివాదాల్లో చిక్కుకుంటూ ఇమేజ్ బ్యాడ్ చేసుకుంటోంది. ఆ మధ్య సమంతపై కామెంట్లు చేసి.. అకౌంట్ హ్యాక్ అయిందని కబుర్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్యూలో దక్షిణాది ప్రేక్షకులపై నోరు పారేసుకుంది. టాలీవుడ్‌పైనా సెటైర్లు వేసింది.

 తాజాగా పూజా హెగ్డే..

తాజాగా పూజా హెగ్డే..

దక్షిణాది వారికి నడుముపై ధ్యాస ఉంటుంది. అది చూపిస్తే చాలు. సౌత్ సినిమా వాళ్లు నడుము వ్యామోహంలో ఉంటారు. అంతేకాకుండా మిడ్ డ్రెస్‌లలో తమను చూడాలనుకుంటారని పూజా చెప్పుకొచ్చింది. అల వైకుంఠపురములో తన కాళ్లను చూపించారని చెప్పుకొచ్చింది. ఇలా సౌత్‌ను, టాలీవుడ్‌ను కించపర్చడం ఇక్కడి వారు హర్ట్ అయ్యారు.

ఏకిపారేశారు..

ఏకిపారేశారు..

డబ్బు సంపాదించుకున్న చోటు.. నిలబడి ఎదిగిన చోటు.. అన్నం పెట్టిన ఇండస్ట్రీ.. ప్రేమను కురిపించే అభిమానులను కించపరిచేలా పూజా హెగ్డే వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పూజా హెగ్డేను సోషల్ మీడియాలో దారుణంగా ఏకిపారేవారు. ట్రోలింగ్‌తో పూజా హెగ్డేను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని గుర్తించిన పూజా హెగ్డే దిద్దుబాటు చర్యలను చేపట్టింది.

రుణపడే ఉంటాను..

రుణపడే ఉంటాను..

‘నేను ఒక ఇంటర్వూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా.. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.. మీరు మొత్తం ఇంటర్వ్యూను చూడండి' అని పూజా హెగ్డే కోరింది.

Recommended Video

Samantha Fans Demand Apologize From Pooja Hegde
స్టార్ హీరోయిన్‌గా..

స్టార్ హీరోయిన్‌గా..

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ సరసన రాధేశ్యామ్‌లో నటిస్తోంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ మధ్యే రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లింది.. మళ్లీ తిరిగి వచ్చి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌రల్ షూటింగ్‌లో పాల్గొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X