ఆ ఒక్కరితోనే చేయాలనుకున్నాను.. ఆయన ఉండుంటే ఇంకోలా ఉండేది.. పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌పై పరోక్ష కామెంట్స్ చేస్తూ సంచలనంగా మారింది. ఎప్పుడైతే కత్తి మహేష్ పవన్ వ్యవహారాన్ని ఉటంకిస్తూ పూనమ్ కౌర్ పేరును తీశాడో అప్పటి నుంచి వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్, త్రివిక్రమ్‌లతో ముడి పెడుతూ కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలకు నేటికీ సమాధానం దొరకడం లేదు. అయితే ఆ వ్యవహారంలో పూనమ్ కౌర్ తలదూర్చకపోయినా.. అనంతరం ఆమె చేసే పరోక్ష కామెంట్స్ ఎన్నో అనుమానాలకు దారి తీశాయి. జల్సా సినిమాతో వీరి మధ్య వ్యవహారం చెడిందని అప్పట్లో తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇస్తూ నాటి సంగతులను గుర్తు చేసుకుంది పూనమ్ కౌర్.

దాసరి జయంతి రోజున..

దాసరి నారాయణరావు జయంతి రోజున పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ.. ‘తండ్రి సమానులైన దాసరి నారాయణ రావు జయంతి రోజున మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఆయనే నాకు సర్వస్వం. ఆయనే నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను చూశారు. సినిమాలు చేయాలని ఎంతో ప్రోత్సహించారు. మంచి ఆర్టిస్ట్‌వి కానీ నీకు సరైన బ్రేక్ రావడం లేదు.. నా ఆరోగ్యం బాగాయ్యాక నీతో ఓ సినిమా చేస్తానని దాసరి గారు అన్నారు' అంటూ చెప్పుకొచ్చింది.

ఆయన బతికి ఉంటే..

నేను ఎప్పుడూ ఆయన దగ్గరకు చిన్నపిల్లలాగే వెళ్లేదాన్ని ఆశీర్వాదం తీసుకునేదాన్ని. నేను ఇంత వరకు ఎవరితోనూ సినిమా చేయలను కోలేదు ఒక్క ఆయనతో తప్పా. ఆయన బతికి ఉండి ఉంటే.. నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేవి. నాపై వచ్చిన తప్పుడు వార్తలన్నీ క్లియర్ అయ్యేవి. నా కష్ట కాలంలో ఆయన్ను ఎంతో మిస్ అయ్యాను.

ఎవ్వరితోనూ చేయాలనుకోలేదు..

ఎన్నికల సమయంలో నాపై ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.. జల్సా సినిమాలో నన్ను తీసుకోలేదని వచ్చిన వార్తలు నన్నెంతో బాధించాయి. కానీ అవన్నీ అవాస్తవాలు నిరాధారాలే. నేను ఎవ్వరినీ కూడా ఇంత వరకు సినిమా అవకాశాలు అడగలేదు.. చేయాలని కోరిక కూడా లేదు.. ఒకవేళ అలాంటిది ఉంది అంటే కేవలం అది దాసరి నారాయణరావు గారితోనే తప్పా మరెవరితోనూ కాదు.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic

వక్రీకరించి రాస్తున్నారు..

వారి సొంత ప్రయోజనాల కోసం నా వ్యాఖ్యలను వక్రీకరించి రాస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు మళ్లీ ప్రస్తావిస్తున్నానంటే.. నాడు నేను అనుభవించిన బాధను చెప్పడానికి మాత్రమే. గమనిక.. నేను కేవలం సినిమా విషయాలపై వచ్చిన రూమర్స్‌పై మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది పూర్తిగా సంపూర్ణం కాదు కేవలం ఒక భాగమే.' అంటూ ట్వీట్ల మీదు ట్వీట్స్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X