అందుకే నేను వారిని ప్రేమిస్తాను.. పూనమ్ కౌర్ కామెంట్స్
పూనమ్ కౌర్ కామెంట్స్, ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించినవో చెప్పడం కాస్త కష్టమే. ఆమె ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్స్ వేస్తూనే ఉంటుంది. అయితే అవి సినీ రాజకీయాలతో ముడి పడి ఉండటం, అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఉండటంతో అవి తెగ వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య నాయకుడు, అబద్దాలు ఆడేవాడు అంటూ చేసిన ట్వీట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా పూనమ్ అలాంటిదే మరో ట్వీట్ వేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
పూనమ్ కౌర్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే మరింత పాపులర్ అయింది. ఆమె చేసే కామెంట్లే ఉనికిని చాటుతున్నాయి. ఒక్కోసారి ఆ పరోక్ష కామెంట్లు ఆమెకు తీవ్ర నష్టాన్ని కూడా కలిగించాయి. అయితే ఆమె ఉద్దేశ్యం మాత్రం ఏనాడు ఎవ్వరికీ స్పష్టంగా అర్థం కాదు.

శ్రీ రెడ్డితో కోల్డ్ వార్..
పూనమ్ కౌర్, శ్రీ రెడ్డికి గత కొన్ని రోజులు యుద్దం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. పూనమ్ కౌర్ మాత్రం పరోక్షంగా కామెంట్స్ చేస్తుంటే శ్రీరెడ్డి మాత్రం పూనమ్ పేరు పెట్టేసి తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా పూనమ్ చేసిన ట్వీట్.. గతంలోని కొన్నింటిని గుర్తు చేస్తోంది.

వెంటనే డిలీట్..
అప్పట్లో దిశ హత్యకేసుపై స్పందిస్తూ.. ‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి థ్యాంక్స్. ఇలాగే నాలా పలువురు మహిళల్ని మోసం చేసిన కొంతమంది సిని అలియాస్ రాజకీయ నాయకుల్ని కూడా శిక్షిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు.'అని ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసింది.

అలాంటి వారికే ప్రేమ, వైరాగ్యం..
అలాగే పూనమ్ రాసిన ఓ కవిత కూడా తెగ వైరల్ అయింది.‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడేవ్యక్తి వీరుడవుతాడు.. రాజులు శాసిస్తారు.. వీరులు మిమ్మల్నికాపాడుతారు.. శాసించాలి అని తపనవాడికి అహంకారం ఉంటుంది.. అందరూ బాగుండాలనుకునే వ్యక్తులలో ప్రేమ, వైరాగ్యం ఉంటుంద'ని పీకే లవ్, జై హింద్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో పోస్ట్ చేసింది.
Recommended Video

అందుకే ప్రేమిస్తాను..
పూనమ్ కౌర్ తాజాగా స్పందిస్తూ.. ‘ప్రతీ రోజూ ఏదో ఒక ఆరోపణలు రావడం, చేయడమే రాజకీయం. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే నాయకత్వం మాత్రం అలాంటిది కాదు. ఆరోపణలకు స్పందించకుండా, భరిస్తూ.. అవసరం వచ్చినప్పుడు వాటినే బలంగా మార్చుకోవడమే నాయకత్వం. అందుకేనేమో నాకు రాజకీయ నాయకులకంటే లీడర్స్‌నే ప్రేమిస్తాను' అని పేర్కొంది. అయితే ఆ లీడర్స్ ఎవరో అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











