పూనమ్ కౌర్ వీడియోలు వైరల్.. భజన బ్యాచ్, పెయిడ్ మీడియా అంటూ ఫైర్.. ట్వీట్స్ తొలగించిన నటి
పూనమ్ కౌర్‌కు ట్వీటేయడం, మళ్లీ డిలీట్ చేయడం సర్వసాధారణమైంది. ఆ మధ్య కూడా అంతే ట్వీట్స్ వేసేది.. మళ్లీ కాసేపటి డిలీట్ చేసేది. లేదా హ్యాక్ అయిందనంటూ కబుర్లు చెప్పేది. తాజాగా పూనమ్ మరోసారి మీడియాపై రెచ్చిపోయింది. ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసింది. అయితే మళ్లీ కాసేపటికే ఆ ట్వీట్స్ తొలగించింది. అయితే అప్పటికే వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తెగ వైరల్ అయ్యాయి. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

పూనమ్ ట్వీట్స్..
పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తి, రాజకీయం, సినిమా ఇలా ప్రతీ అంశంపై స్పందిస్తూనే ఉంటుంది. తనపై వచ్చే నెగెటివ్ కామెంట్స్‌పైనా విరుచుకుపడుతుంది. మీడియాపై పరుష పదజాలాన్ని వాడుతూ ఉంటుంది. పెయిడ్ మీడియా అంటూ ఇదివరకు ఎన్నోసార్లు కామెంట్ చేసింది.

టిక్ టాక్ వీడియోతో మొదలు..
అంతర్జాతీ నృత్య దినోత్సవం (ఏప్రిల్ 29) నాడు ఓ క్లాసిక్ సాంగ్‌కు పూనమ్ టిక్ టాక్ చేసింది. అయితే అందులో ఆమె వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంది. ఇక ఆ వీడియో తెగ హల్చల్ అయింది. అయితే కాసేపటికే ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త వైరల్ కావడంతో.. ఆయన గౌరవార్థం ఆ వీడియోను తొలగించింది.

పూనమ్ టిక్ టాక్‌పై వార్త..
సెలెబ్రిటీలు చేసే టిక్ టాక్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ టిక్ టాక్ ఆధారంగా రాసిన వార్తలో అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్ చేస్తోంది.. కానీ వర్కౌట్ కావడం లేదని అంతేకాకుండా ఆమె వయస్సును కూడా 36 అని తప్పుగా రాయడంపై విరుచుకుపడింది.

భజన బ్యాచ్, పెయిడ్ మీడియా..
తనపై నెగెటివ్ కామెంట్స్ చేసిన వారు కాల గర్భంలో కొట్టుకోపోయారని ఫైర్ అయింది. మీకు నా పుట్టిన రోజు ఎప్పుడో కూడా తెలీదని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వీడియో షేర్ చేశానని, అయితే ఇర్ఫాన్ గౌరవార్థం తొలగించానని తెలిపింది.


Click it and Unblock the Notifications











