భారత చరిత్రలో అది చీకటి అధ్యాయం.. పూనమ్ కౌర్ ఎమోషనల్ ట్వీట్
పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్‌తో ముడిపెడుతూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో పూనమ్ కౌర్ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న క్రేజ్‌కు పదింతల పాపులారిటీ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఏదో రకంగా పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె చేసే ప్రతీ ట్వీట్ ఎంతగానో వైరల్ అవుతుంది. సినీ రాజకీయ అంశాలపై స్పందించే పూనమ్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.

ఎన్టీఆర్‌కు నివాళి..
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్‌ను సందర్శించిన పూనమ్ కౌర్ కాస్త ఎమోషనల్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ప్రస్తుత కాలంలో తన లాంటి నాయకుడు, హీరో రావాలని తెలిపింది. దుష్ట శక్తులతో పోరాడే శక్తిని ఇవ్వండి, స్వర్గం నుంచి దీవించండని కోరింది.

పరోక్ష ట్వీట్స్..
పూనమ్ కౌర్ అంటే పరోక్ష ట్వీట్లకు ప్రసిద్ది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్స్ వేస్తుందో ఓ పట్టాన అర్థం కాదు. అందులో నిగూఢంగా దాగిన అర్థాలుంటాయి. తాజాగా ఇదే క్రమంలో బాధ్యత గురించి అందరిని వదిలేసిన అమ్మాయి వేశ్య కంటే దారుణమని కామెంట్ చేసింది. అయితే ఇది శ్రీ రెడ్డిని ఉద్దేశించి చేసిందేనని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు.

ఇష్టదైవం..
పూనమ్ కౌర్ సిక్కు మతానికి చెందిన వారు. గురు గోవింద్ సింగ్‌ను ఎక్కువగా ఆరాధిస్తుంది. అందుకే ఈ మధ్య సీపీ సజ్జనార్‌కు ఆయన చిత్రపటాన్నే బహూకరించింది. అయితే సిక్కుల ఊచకోత అనేది భారత చరిత్రకు మాయని మచ్చలా మిగిలిపోయింది. అదే విషయాన్ని గుర్తు చేస్తూ..పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది.

ఆపరేషన్ బ్లూ స్టార్..
అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను అంతం చేయడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బ్లూ స్టార్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ క్రమంలో గోల్డెన్ టెంపుల్ విధ్వంసానికి గురైంది. ఆ తరువాత ఇందిరా గాంధీని సిక్కు బాడీ గార్డ్ కాల్చిచంపారు. ఆ సమయంలో ఢిల్లీ రణరంగంగా మారింది.
Recommended Video

పూనమ్ కౌర్ భావోద్వేగ ట్వీట్..
నాడు జరిగిన సిక్కుల ఊచకోతపై పూనమ్ స్పందిస్తూ.. ‘1984 అనేది ఎంతో బాధకరమైన సంఘటన ఎంతో మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు.. స్వామి, కుష్వంత్ సింగ్ ప్రకారం గోల్డెన్ టెంపుల్ ఘటనను నిరోధించే అవకాశం ఉంది.. ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లిలో జరిగిన ఉదంతం ఇండియన్ హిస్టరీలో చీకటి అధ్యాయం' అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











