సుశాంత్‌ను అలా చంపారు.. మిమ్మల్ని వదిలిపెట్టను.. పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్

పూనమ్ కౌర్ గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. నెపోటిజం, బాలీవుడ్‌పై ఫైర్ అయింది. దీనిలో భాగంగా తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మళ్లీ ప్రస్తావించింది. తాను డిప్రెషన్‌కు లోనయ్యానని, తనపైనా కుట్ర చేశారని గురూజీ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ ట్వీట్లు మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీటిపై వచ్చిన వార్తలపైనా పూనమ్ మరోసారి స్పందించింది.

Recommended Video

Poonam Kaur Satire On Sri Reddy || వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం!!
నాటి విషయాలు..

నాటి విషయాలు..

తాను డిప్రెషన్‌కు లోనైన సంగతుల గురించి పూనమ్ చెబుతూ.. ‘రిలేషన్ మెయింటైన్ చేసిన ఒక దర్శకుడి దగ్గరకు వెళ్లిన నా స్నేహితుడు. రెండు మూడు సార్లు నా పరిస్థితి గురించి వివరించాడు. ఆమె డిప్రెషన్ లో ఉందని ఈ సమయంలో ఆమెకు హెల్ప్ చేయాలని కోరాడు. కానీ దర్శకుడు మాత్రం పట్టించుకోకుండా అలానే లేట్ చేస్తూ వచ్చాడు. ఆ తరువాత నేనే వెళ్లి అతన్ని డైరెక్ట్ గా ప్రశ్నించాను.

ఒక్కరోజు వార్త అవుతుంది...

ఒక్కరోజు వార్త అవుతుంది...

నేను నీతో మాట్లాడాలి అంటూ నా పరిస్థితిని ఈ డిప్రెషన్ ని మార్చగలవా అని అడిగాను. అంతే కాకుండా నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అన్నాను. వెంటనే ఆ దర్శకుడు ఒక సమాధానం ఇచ్చాడు. నువ్వు చచ్చిపోతే ఏమి జరగదు. ఒక్కరోజు మాత్రమే న్యూస్ లో ఉంటావు అని అనగానే నాకు నా అసహ్యం వేసింది. మీడియాను, మూవీ మాఫియాను, అడ్వర్టైజ్‌మెంట్స్‌ను అతనే కంట్రోల్ చేస్తాడ'ని చెప్పుకొచ్చింది.

మీడియాలో వైరల్..

మీడియాలో వైరల్..

పూనమ్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. వీటిలో తాను ఎవ్వరి పేరు పేరు ప్రస్థావించకపోయినా.. కొందరు త్రివిక్రమ్‌పైనే ఆరోపణలు చేసిందని రాశారు. దీంతో పూనమ్ మీడియాపై సెటైర్స్ వేసింది. బ్లడీ ట్రూత్ అంటూ, ఆ డైరెక్టర్ ఎంత ఇచ్చాడంటూ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఓ మీడియాపై ఛలోక్తులు విసిరింది. అన్ని ముందుగానే తెలుస్తాయని కౌంటర్స్ వేసింది.

తాజాగా మరోసారి..

తాజాగా మరోసారి..

తాను వేసిన ట్వీట్లపై ఓ జర్నలిస్ట్ చేసిన వీడియో పూనమ్‌కు ట్యాగ్ చేశారు పవన్ ఫ్యాన్స్. వాటిపై స్పందిస్తూ ఇలాంటి వారి వల్లే సుశాంత్ వంటి వారు చనిపోతున్నారు. డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్లు.. నేను ఎప్పుడు ఎవరినీ ఏది అడగలేదు.. అంటూ ఫైర్ అయింది.

సుశాంత్‌ను అలాగే చంపారు..

సుశాంత్‌ను అలాగే చంపారు..

పూనమ్ మీడియాపై స్పందిస్తూ.. ‘2017 మే 9 నుంచి నాపై బురద జల్లేందుకు పరోక్ష ఆర్టికల్స్ రాసిన వారిని ఊరికే వదిలిపెట్టను. వాస్తవానికి దూరం చేస్తున్నారు. ఓ అమ్మాయి జీవితం ఓ సినీ జీవితంతో సమానం. ఇక చాలు. ఇలా మానసికంగా బాధపెట్టే సుశాంత్ మరణానికి కారణం అయ్యారు. నేను కూడా మీ అందర్నీ అలానే చేస్తాను'అని చెప్పుకొచ్చింది. ఇక సదరు నెటిజన్ ఆ ట్వీట్, వీడియోను డిలీట్ చేయడంతో మంచిది మరోసారి చేయకండని సలహా ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X