For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడమని ఉసిగొల్పాడు.. ఆ దర్శకుడి గుట్టు విప్పిన పూనమ్ కౌర్

  |

  రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. ఆ సమయానికి ఏది అనిపిస్తే అది చేసేస్తాడు. ఏ సినిమా మైండ్‌లోకి వస్తే దాని గురించి ప్రకటన చేస్తాడు. టైటిల్ కూడా ప్రకటిస్తాడు. ఆపై అవి అటకెక్కుతాయి. వాటిలో ఎన్ని సెట్స్ మీదకు వచ్చి తెరపైన సందడి చేస్తాయో చెప్పలేం. తాజాగా వర్మ ప్రకటించిన ఓ సినిమా, ఆ టైటిల్ పెద్ద చిచ్చును పెట్టేలానే కనిపిస్తోంది. వర్మ ఆ సినిమా గురించి ప్రకటించిన వెంటనే పూనమ్ కౌర్ రెచ్చిపోయింది. వర్మ గురించి అసలు విషయాలను బయటపెట్టింది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

  పవర్ స్టార్ పేరిట..

  పవర్ స్టార్ పేరిట..

  బ్రేకింగ్ న్యూస్ అంటూ వర్మ మళ్లీ ప్రకంపనలు సృష్టించాడు. పవర్ స్టార్ అనేది తన తదుపరి చిత్ర టైటిల్ అని అందులో నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఓ రష్యన్ మహిళా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా టిక్ టాక్ ఫేమ్ పవన్ కళ్యాణ్ తన హీరో అని ప్రకటించాడు. అయితే అతను ఎవరిలా అయినా కనిపిస్తుంటే, అనిపిస్తుంటే అది తన తప్పు కాదన్నట్టుగా తెలిపాడు.

  స్పందించిన పూనమ్..

  స్పందించిన పూనమ్..

  వర్మ తన సినిమా గురించి ప్రకటించిన వెంటనే పూనమ్ స్పందించింది. ఈ సినిమాలో ఆర్జీవీ కూడా జత చేయండని కోరింది. అమ్మాయిల బలహీనతలు తెలుసుకుని, వారిని తీవ్ర దూషణలు చేసేలా రెచ్చగొట్టడం, మళ్లీ ట్వీట్ల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం లాంటివి చేసే వాడి పాత్రను కూడా పెట్టండని తెలిపింది. తాను నిన్న చిన్నతనంలో ఎంతో గౌరవించానని, కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది.

   అలా రెచ్చగొట్టాడు..

  అలా రెచ్చగొట్టాడు..

  ఓ డైరెక్టర్ ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని తన బ్రెయిన్‌ను దాదాపు గంటసేపు వాష్ చేశాడని గతంలో జరిగిన విషయాలను తవ్వింది పూనమ్ కౌర్. తనకు ఆ డైరెక్టర్ పంపిన ఆ మెసెజ్‌లను సదరు పార్టీ ప్రతినిధులకు పంపానని తెలిపింది. అతని దురద్దేశాన్ని తనకు కొందరు మీడియా వారు తెలియజేశారని, కొందరైనా నిజాయితీ వ్యక్తులు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలను తెలిపింది.

  Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
  నీకు వారు ఫండ్ ఇవ్వలేరు..

  నీకు వారు ఫండ్ ఇవ్వలేరు..

  ‘జియా ఖాన్ మరణం వెనుకున్న రహస్యాలు తెలుసుకోవాలి, ఇండస్ట్రీలోని నిజానిజాలు బయట పెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఆమె తల్లి బాధను అర్థం చేసుకున్నారని అనుకుంటాను.. మీకు వారెవ్వరూ ఫండ్ ఇవ్వరు.. మీకు దానితో ఎలాంటి లాభం ఉండదు..కాబట్టి మీరు వారిపై సినిమాలు తీయరు' అని పూనమ్ కౌర్ చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. నాడు పవన్ కళ్యాణ్‌ను బూతులు తిట్టమని శ్రీ రెడ్డిని ఉసిగొల్పింది ఆర్జీవేనన్న సంగతి అందరికీ తెలిసిందే.

  English summary
  Poonam Kaur Fires On RGV About HIs POWER STAR Movie. Plz include a character named #rgv who calls girls finding out their emotional weakness n instigates them to use abusive language and sends tweets to them to share as if they are doing it n then informs media about it ...I respected U when I was a child ...feel sad about u now
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X