Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లి సరసన!
- News మెగాస్టార్ అనూహ్య నిర్ణయం
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
అది ఒక వేశ్య కంటే దారుణం.. శ్రీరెడ్డిపై పూనమ్ కౌర్ కామెంట్!
పూనమ్ కౌర్ గురించి, ఆమె వేసే ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విషయంలో కత్తి మహేష్ పూనమ్ కౌర్‌ను ఎంటర్ చేశాడో అప్పటి నుంచి ఆమె క్రేజ్ పెరిగింది.అప్పటి వరకు సినిమాలతో వచ్చిన ఫేమ్‌కు పదింతలు వచ్చింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ విషయాలపై పూనమ్ వేసే పరోక్ష ట్వీట్స్ కూడా ఆమెను బాగానే ఫేమస్ చేశాయి. ఎప్పుడు ఎలాంటి ట్వీట్స్ వేస్తుందో అది ఎవరిని ఉద్దేశించి చేసిందో అందులోని అర్థం ఏంటోకూడా ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. తాజాగా పూనమ్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్‌కు నివాళి..
టాలీవుడ్ సినీ పెద్దలపై పూనమ్ కౌర్ తన ప్రేమను చాటుతూ ఉంటుంది. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించింది. ప్రస్తుత కాలంలో ఆయన లాంటి నాయకులు, అలాంటి నటులు కావాలని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా పూనమ్ కౌర్‌పై శ్రీ రెడ్డి సెటైర్స్ వేస్తూ ఓ పోస్ట్ చేసింది.
దాని వెనకాల ఏముంది?
పూనమ్ కౌర్ పీకే మాస్క్ ధరించడంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేస్తూ.. ‘పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు కౌంటర్ గానే పూనమ్ స్పందించినట్టు తెలుస్తోంది.
వేశ్య కంటే దారుణం..
పూనమ్ కౌర్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ.. ‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం'అని పేర్కొంది.
Recommended Video
పరోక్షంగా శ్రీ రెడ్డినే..?
రెండు మూడ్రోజుల క్రితం శ్రీరెడ్డి పూనమ్ కౌర్‌పై చేసిన కామెంట్లకు ధీటుగానే తాజాగా ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ పోస్ట్‌లో శ్రీ రెడ్డి పేరును మాత్రం ఎక్కడా ప్రస్థావించలేదు. కానీ ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే.. అవి శ్రీరెడ్డిని ఉద్దేశించి అన్నట్టుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిపై శ్రీ రెడ్డి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.