For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిన్నతనం నుంచీ తిరస్కరణ.. అందుకే అమితమైన గౌరవం .. ఎన్టీఆర్‌పై పూనమ్ కౌర్ పరోక్ష ట్వీట్

  |

  స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ కొడుకుగా చిత్రసీమకు పరిచయం అయ్యాడు జూ ఎన్టీఆర్. అయితే అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా మొదటి చిత్రంతో సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చాడు. పైగా నందమూరి కాంపౌండ్ ప్రభావం ఆ సినిమాపై ఏ మాత్రం కనిపించదు. అప్పుడే జనాలకు కూడా అర్థమైంది.. ఎన్టీఆర్‌కు బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంది కానీ.. వారి బలం గానీ, మద్దతు గానీ లేదని. ఒంటరిగా కష్టపడ్డాడు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు.

  చిట్టచివరకు తాతకు తగ్గ మనవడు అని అందరి చేత అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ జీవిత ప్రయాణంపై తనకెంతో గౌరవమని పరోక్షంగా చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

  ఇండియాలో ఏ స్టార్‌కూ దక్కని ఫీట్.. నందమూరి అభిమానుల సత్తా.. దటీజ్ యంగ్ టైగర్

  ఒంటరిగానే నిలదొక్కుకున్నాడు..

  ఒంటరిగానే నిలదొక్కుకున్నాడు..

  మొదటి చిత్రం నిన్ను చూడాలని ఫ్లాప్ అయినా నిరాశ చెందని ఎన్టీఆర్.. రెండో అవకాశం కోసం ఎదురుచూశాడు. ముందు రాజమౌళి ముభావంగానే ఒప్పుకున్నా.. ఎన్టీఆర్ నటనను చూసి ముగ్దుడైపోయాడు. ఈ విషయాన్ని రాజమౌళియే స్వయంగా ఒప్పుకున్నాడు. స్టూడెంట్ నెం.1 ఓ రేంజ్‌లో హిట్ అయి ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టింది. మీసాలు కూడా సరిగ్గా రాని సమయంలో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.

  ఇండస్ట్రీ హిట్స్‌తో దుమ్ములేపాడు..

  ఇండస్ట్రీ హిట్స్‌తో దుమ్ములేపాడు..

  ఆది, సింహాద్రి వంటి సినిమాలతో లేత ప్రాయంలోనే బాక్సాఫీస్‌ను దడదడలాడించాడు. ఏజ్ తక్కువే రేంజ్ ఎక్కువ అని సింహాద్రిలోని ఓ డైలాగ్ ఎన్టీఆర్‌ను చూసే రాసిందంటే ఆశ్చర్యమనిపించక మానదు. అలా నందమూరి అనే ట్యాగ్ అయితే ఉంది కానీ తండ్రి, బాబాయ్ బాలయ్యల మద్దతు మాత్రం లేదు.

  స్టార్ అయ్యాక సపోర్ట్..

  స్టార్ అయ్యాక సపోర్ట్..

  ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆరే నిజమైన వారసుడని ప్రజలు కీర్తించడం మొదలుపెట్టారో అప్పుడే నందమూరి ఫ్యామిలీ కాస్త దగ్గరైంది. అయితే బాలకృష్ణతో ఇప్పటికీ విబేధాలున్నాయని గుసగుసలు వినిపిస్తాయి. హరికృష్ణ మరణానంతరం.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారు.

  పూనమ్ కౌర్ పరోక్ష ట్వీట్..

  పూనమ్ కౌర్ పరోక్ష ట్వీట్..

  ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. అయితే అందులో ఎన్టీఆర్ పేరు ఎక్కడా వాడకపోయినా.. అది ఆయన గురించేనని ఎవ్వరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకీ ఆమె ట్వీట్ సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం.

  Poonam Pandey Condemns Her Arrest News
  ప్రేమకు తిరస్కరణ..

  ప్రేమకు తిరస్కరణ..

  ‘అతని ప్రమేయం లేకుండా, అతని తప్పులు లేకుండా చిన్నతనం నుంచి పెద్దయ్యే వరకు తిరస్కరణకు గురయ్యాడు.. ఆయన ప్రయాణం పట్ల నాకెంతో అపారమైన గౌరవం ఉంది.. స్వర్గంలో ఉన్న ఆయన తాత, ఎంతో మంది సహృదయుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయి.. బెస్ట్ విషెస్' అని పేర్కొంటూ హార్ట్ సింబల్స్‌ను షేర్ చేసింది పూనమ్. అయితే కామెంట్ సెక్షన్స్‌లో తారక్ ఫ్యాన్స్ అందరూ థ్యాంక్యూ పూనమ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

  English summary
  Poonam Kaur Indirectly Wishes Jr NTR. She Says That He has been denied love in his growing up years for no mistake of him .... from a child to a grown up ...immensely respect his journey ...... may be blessed with all the heart n blessing from the grand father up above the heaven....best wishes !
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X