అవినీతి పరులకు ఎందుకు ఓట్లు వేస్తున్నాం.. పూనమ్ కౌర్ పరోక్ష ట్వీట్ ఎవరిపై?

పూనమ్ కౌర్ వేసే ట్వీట్స్ ఎంతలా ఆలోచింపజేస్తుందో అందరికీ తెలిసిందే. ఎవరిని ఉద్దేశించి చేసిందో, ఎవరిపై సెటైర్స్ వేస్తుందో చెప్పడం చాలా కష్టం. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉండే పూనమ్.. రాజకీయాలు, నాయకులు, లీడర్స్ అంటూ ప్రస్థావిస్తుంటుంది. అయితే ఆమె చేసే కామెంట్స్ కొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. తాజాగా ఆమె చేసిన 'అవినీతి' కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

అలాంటి వారికే ప్రేమ, వైరాగ్యం..

అలాంటి వారికే ప్రేమ, వైరాగ్యం..


ఆ మధ్య పూనమ్ రాసిన ఓ కవిత ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడేవ్యక్తి వీరుడవుతాడు.. రాజులు శాసిస్తారు.. వీరులు మిమ్మల్నికాపాడుతారు.. శాసించాలి అని తపనవాడికి అహంకారం ఉంటుంది.. అందరూ బాగుండాలనుకునే వ్యక్తులలో ప్రేమ, వైరాగ్యం ఉంటుంద'ని చేసిన ట్వీట్ తెగ హల్చల్ చేసింది.

లీడర్స్ అంటే..

లీడర్స్ అంటే..

పూనమ్ కౌర్ తాజాగా స్పందిస్తూ.. ‘ప్రతీ రోజూ ఏదో ఒక ఆరోపణలు రావడం, చేయడమే రాజకీయం. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే నాయకత్వం మాత్రం అలాంటిది కాదు. ఆరోపణలకు స్పందించకుండా, భరిస్తూ.. అవసరం వచ్చినప్పుడు వాటినే బలంగా మార్చుకోవడమే నాయకత్వం. అందుకేనేమో నాకు రాజకీయ నాయకులకంటే లీడర్స్‌నే ప్రేమిస్తాను' అని పేర్కొంది. అయితే ఆ లీడర్స్ ఎవరో అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అవినీతి అంటే ఏమిటి..

అవినీతి అంటే ఏమిటి..

తాజాగా పూనమ్ కౌర్ అవినీతి అంటే ఏమిటి? దయచేసి తెలపండని నెటిజన్లను కోరింది. దీంతో ఆమె చేసిన ట్వీట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే తాజాగా తనకు వచ్చిన రిప్లైలను ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
తెలిసి కూడా మరి ఎందుకు..?

తెలిసి కూడా మరి ఎందుకు..?

అయితే అవినీతి అంటే ఏంటో తెలిసిన మనమంతా ఎందుకు అవినీతి పరులకు ఓట్లు ఎందుకు వేస్తున్నాం.. వారిని ఎందుకు ఎన్నుకుంటున్నామని ప్రశ్నించింది. ఇక ఈ ట్వీట్ చూసిన కొందరు ఇవి ఏపీ పాలిటిక్స్ గురించేనా? అని అడుగితే తాను దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నానని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X