ఈ సన్నాసి వల్ల మీ అన్న జీవితం నాశనం.. నెటిజన్‌కు పూనమ్ రిప్లై వైరల్

పూనమ్ కౌర్ ఈ రోజు చాలా ఓపెన్ అవుతోంది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటంపై చలించిపోయిన పూనమ్.. బాలీవుడ్‌ను ప్రశ్నించింది. అలాగే టాలీవుడ్‌లో తనకు జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేసుకుంది. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేసింది. ఎవ్వరి పేరు ప్రత్యక్షంగా ప్రస్థావించకపోయినా.. గురూజీ అనడంతో అందరికీ అది అర్థం అయిపోతోంది. అయితే వీటిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. వాటికి పూనమ్ చెప్పిన సమాధానాలు మరింతగా వైరల్ అవుతున్నాయి.

గత విషయాలను తవ్వింది..

గత విషయాలను తవ్వింది..

తనకు బాగా లేనప్పటి సంగతుల గురించి పూనమ్ చెబుతూ.. ‘రిలేషన్ మెయింటైన్ చేసిన ఒక దర్శకుడి దగ్గరకు వెళ్లిన నా స్నేహితుడు. రెండు మూడు సార్లు నా పరిస్థితి గురించి వివరించాడు. ఆమె డిప్రెషన్ లో ఉందని ఈ సమయంలో ఆమెకు హెల్ప్ చేయాలని కోరాడు. కానీ దర్శకుడు మాత్రం పట్టించుకోకుండా అలానే లేట్ చేస్తూ వచ్చాడు. ఆ తరువాత నేనే వెళ్లి అతన్ని డైరెక్ట్ గా ప్రశ్నించాను.

ఒక్కరోజు వార్త అవుతుంది...

ఒక్కరోజు వార్త అవుతుంది...

నేను నీతో మాట్లాడాలి అంటూ నా పరిస్థితిని ఈ డిప్రెషన్ ని మార్చగలవా అని అడిగాను. అంతే కాకుండా నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అన్నాను. వెంటనే ఆ దర్శకుడు ఒక సమాధానం ఇచ్చాడు. నువ్వు చచ్చిపోతే ఏమి జరగదు. ఒక్కరోజు మాత్రమే న్యూస్ లో ఉంటావు అని అనగానే నాకు నా అసహ్యం వేసింది. మీడియాను, మూవీ మాఫియాను, అడ్వర్టైజ్‌మెంట్స్‌ను అతనే కంట్రోల్ చేస్తాడ'ని చెప్పుకొచ్చింది.

మీడియాలో వైరల్..

మీడియాలో వైరల్..

పూనమ్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. వీటిలో తాను పేరు ప్రస్థావించకపోయినా.. కొందరు త్రివిక్రమ్‌పైనే ఆరోపణలు చేసిందని రాశారు. దీంతో పూనమ్ మీడియాపై సెటైర్స్ వేసింది. బ్లడీ ట్రూత్ అంటూ, ఆ డైరెక్టర్ ఎంత ఇచ్చాడంటూ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఓ మీడియాపై ఛలోక్తులు విసిరింది. అన్ని ముందుగానే తెలుస్తాయని కౌంటర్స్ వేసింది.

ఫిర్యాదు చేయండి..

ఫిర్యాదు చేయండి..

అయితే ఈ ట్వీట్లను చూసిన ఓ నెటిజన్ దీనిపై లీగల్‌గా పోరాడాలని సలహా ఇచ్చాడు. దీంతో పూనమ్‌కు చిర్రెత్తినట్టుంది. సదరు నెటిజన్‌కు రిప్లై ఇస్తూ.. ‘మీ అన్న చెప్పారా? ఆయన ఓడిపోతే హ్యాపీగా ఉందా? ఆయన ఇన్‌సల్ట్ అయింది హ్యాపీగా ఉందా? చెప్పండి. మూడు పెళ్లిళ్లు అని అవమానం చేస్తుంటే హ్యాపీగా ఉందా? ఈ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైందని తెలియాలి.. నమస్తే' అంటూ చెప్పుకొచ్చింది.

Recommended Video

Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
పాత న్యూస్..

పాత న్యూస్..

అయితే వీటిపై మరో నెటిజన్ స్పందిస్తూ ఇది పాత న్యూస్ అంటూ తీసి పారేశాడు. అమ్మాయిల బాధలు మీకు పాత వార్తల్లా ఉంటాయ్ అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని పూనమ్ తెలిపింది. దీనిపై ‘మా', పోలీసులకు ఫిర్యాదు చేయండని సలహా ఇస్తే.. ‘మా' కంప్లైట్స్ తీసుకోదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X