పవన్ కళ్యాణ్ గుండుపై రోజా క్లారిటీ.. ఆ విషయంపై పూనమ్ కౌర్ స్పందన
టాలీవుడ్‌లో కొన్ని విషయాలపై ఎప్పటికీ క్లారిటీ రాదు. అందులో కొందరు హీరోయిన్ల మరణాలుంటే కొందరి హీరో బాగోతాలుంటాయి. అందులో సుమన్ జైలుకు వెళ్లడం, బాలయ్య కాల్పులు, పవన్ కళ్యాణ్ గుండు వ్యవహారం లాంటి వాటిపై ఎప్పటికీ స్పష్టత రాదు. అయితే వీటన్నంటిలో పవన్ కళ్యాణ్ విషయం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. పైగా ఈ విషయంపై పూనమ్ కౌర్ స్పందించడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గుండు వ్యవహారం..
పవన్ కళ్యాణ్ గుండు వ్యవహారం అప్పట్లో తెగ హల్చల్ చేసింది. టీడీపీ నాయకుడికి పవన్ కళ్యాణ్ ఎదురుతిరగడంతో అక్కడే ఆయనకు గుండు కొట్టించారని ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని ఓ లోకల్ న్యూస్ పేపర్, మరో జాతీయ పత్రిక ప్రచురించడంతో అభిమానులు రోడ్డెక్కినట్టు తెలుస్తోంది.

షూటింగ్ కోసమని..
తమ్ముడు షూటింగ్ కోసమే తాను గుండు చేసుకున్నానని తనకు ఎవ్వరూ గుండు కొట్టించలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే అలా చెప్పడంతో కొందరు లాజిక్స్ వెతకడం ప్రారంభించారు. తమ్ముడు షూటింగ్ జరిగింది ఎప్పుడు ఈ ఘటన జరిగింది ఎప్పుడని చెబుతూ.. గుండుతో ఉన్న ఫోటోలను కూడా వైరల్ చేశారు. వర్మ కూడా తన సినిమాలో ఇలాంటి ఓ సీనే పెట్టాడు.
Recommended Video

రోజా సెటైర్లు..
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుండు విషయంపై మాట్లాడింది. తాజాగా ఈ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పుడు గుండు కొట్టించింది టీడీపే, 2014లో గుండు కొట్టించింది టీడీపీయే, 2019 ఎన్నికల్లో కొట్టించబోయేది టీడీపేనని సెటైర్స్ వేసింది. ఆయనకు నిజంగానే గుండు కొట్టించారా? అని సదరు యాంకర్ అడిగితే.. అవును నిజమే.. తమ్ముడు సినిమా కోసం అలా చేయించుకున్నానని చెప్పాడు.. కానీ తమ్ముడు సినిమా ఎప్పుడు వచ్చింది? ఆయనకు గుండు ఎప్పుడు కొట్టించారు? ఆ డేట్స్ చూస్తేనే అర్థమవుతుందని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











