బాలీవుడ్‌పై నోరు ఎందుకు మెదపడం లేదు.. ఆర్జీవీని టార్గెట్ చేసిన పూనమ్ కౌర్
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంపై తారాలోకం నివ్వెరబోయింది. సోషల్ మీడియా అంతా సుశాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే సుశాంత్ మరణానికి దారి తీసిన కారణాలు కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కరణ్ జోహర్, ఖాన్, కపూర్ కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారు.

ఒంటరైన సుశాంత్..
బాలీవుడ్ ప్రోడక్షన్ కంపెనీలన్నీ సుశాంత్‌ను దూరం పెట్టాయని, కావాలనే టార్గెట్ చేశాయని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్‌లోకి వెళ్లిన సుశాంత్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సుశాంత్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బాలీవుడ్‌ను ఏకిపారేస్తున్నారు.

బాలీవుడ్‌పై ఫైర్..
బాలీవుడ్‌లో నెపోటిజమ్ పాతుకుపోయిందని, కొత్త వారిని ఎదగనివ్వరని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, అలియా భట్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఆర్జీవీ స్పందించకపోవడంపై పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది.

సుశాంత్ మృతిపై ఆర్జీవీ..
సుశాంత్ మరణ వార్త తెలిసిన ఆర్జీవీ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘జేమ్స్ డీన్, హెత్ లెడ్జర్ వంటి వారి మరణం కంటే సుశాంత్ మృతి నన్నెంతో షాక్‌కు గురి చేసింది. కరోనాయే కాకుండా దేవుడు బాలీవుడ్‌కు మరో శాపాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ ఇంతకు మునుపెన్నడూ చూడని సంఘటన ఇది.. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో..ఇలా దూరమయ్యాడు ఎందుకు??'అని ట్వీట్ చేశాడు.
Recommended Video

పూనమ్ కౌంటర్..
అయితే బయట ఇంత రచ్చ జరుగుతున్న ఆర్జీవీ బాలీవుడ్‌పై తన అభిప్రాయం చెప్పకపోవడాన్ని పూనమ్ కౌర్ ప్రశ్నించింది. జిహాఖాన్, సుశాంత్‌లకు జరిగిన దానికి గానూ.. బాలీవుడ్‌ను గానీ బాలీవుడ్ పెద్దలను గానీ ఆర్జీవీ ఎందుకు తిట్టడం లేదు.. ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అయితే దీనపై స్పందించడం ఆయనకు లాభం చేకూర్చడం లేదేమో లేదా ఇంకేదైనా కారణమా? అని ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











