ఎంతో ప్రేమించే భార్యను దూరం చేశావ్.. స్లో పాయిజన్‌లా ఆయన్ను చంపాలనుకున్నావా?.. పూనమ్ కౌర్ ట్వీట్
పూనమ్ కౌర్ కూడా గతంలో ఎంతో డిప్రెషన్ అనుభవించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయం మాత్రం ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. దాని కారణంగానే మధ్యలోని సినీ పరిశ్రమను వదిలేసింది. కత్తి మహేష్ ఆరోపణలతో పూనమ్ కౌర్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇక అప్పటి నుంచి ట్వీట్ల యుద్దాన్ని ప్రారంభించింది. ఎవరిని టార్గెట్ చేస్తుందో ఎవరిపై విరుచుకుపడుతుందో చెప్పి చెప్పకుండా చెబుతుంది. పరోక్షంగానే ట్వీట్లు వేస్తూనే పవర్, గురూజీ, జల్సా, అజ్ఞాతవాసి అంటూ ఇలా హింట్లు కూడా ఇస్తుంది. తాజాగా గురూజీ అంటూ వరుస ట్వీట్లతో పెను సంచలనం సృష్టించింది.

సావిత్రి గురించి..
గురూజీ అంటూ పూనమ్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటో ఓ సారి చూద్దాం. ‘స్టేజ్ మీద సావిత్రి గురించి మాట్లాడతాడు.. కానీ ఎప్పుడూ లోకల్ టాలెంట్‌కు ఛాన్స్ ఇవ్వడు. బదులుగా ఆ పనిని చేయకుండా కొంతమందిని ఆపడం, అమ్మాయిని ఐపిఎల్ అందంగా ప్రకటించిన తర్వాత అది సరైనది కాదని మీరు అనుకుంటాడు. మీకు మంత్రుల కొడుకులు, పెద్ద కుటుంబాలకు తెలుసు అయితే ఏంటి? నాకు తెలిసి మీరు ఓ రోగిష్టి అంతేకాకుండా మ్యానిపులేటివ్ కూడా.

సైలెంట్‌గా బ్యాన్..
వాస్తవానికి అతని వద్దకు నేను దేన్ని ఉద్దేశించి వెళ్లలేదు.. నాకున్న సమస్యను పరిష్కరిస్తారామోనని అడిగాను. కానీ మంత్రుల కొడుకులు, స్నేహితుల వల్ల అతని ఉన్న శక్తిని దుర్వినయోగం చేశాడు.. నాకు సాయం చేయడంలో ఆలస్యం చేశాడు.. ఊహల్లో బతకిలే చేయడం, భజన చేస్తూ ఉండటం.. మీరు నన్ను సైలెంట్‌గా బ్యాన్ చేయించారు..అది ఓకే గానీ మీరు మాత్రం గురూజీ కాదు.

నీకంటె ఎక్కువగా ఎవ్వరూ లాభపడలేదు..
నువ్వు ఎన్నో చేశావ్.. నీ లాభం కోసం నీ స్నేహితుడిని మ్యానిపులేట్ చేశావ్.. నాకు తెలిసి నీకంటే ఎవ్వరూ ఎక్కువగా లాభపడలేదు. నువ్వొక రోగివి.. మ్యానిపులేటివ్‌వి గురూజీ' అంటూ తనలోని బాధనంతా బయటకు కక్కింది. మరో ట్వీట్ చేస్తూ అసలు విషయాలను బయటకు తెచ్చింది.
Recommended Video

ప్రేమించే భార్యను కలవకుండా..
ఎవరైతే ఆయన కోసం కోసం ప్రాణమిస్తారో... ఎంతో ప్రేమించే భార్యను కలవకుండా నీ ఫ్రెండ్‌ను ఆపేశావ్.. కానీ వారి మధ్యలో నువ్ వచ్చినందుకు ఈ రోజు ఆ స్టార్ ఎన్నో అవమానాలకు గురి కావాల్సి వస్తోంది. పిల్లలు బాధపడ్డారు.. అతను బాధపడ్డాడు.. ఇంకా బాధపడుతూనే ఉన్నాడు.. ఇదంతా ఎందుకు చేశావ్.. స్లో పాయిజన్‌లా అతడ్ని చంపాలనుకుంటున్నావా? అని పూనమ్ ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











