డైరెక్ట్‌గా అదే అడిగేశాడు!.. లైవ్ చాట్‌లో పూనం పాండేకు షాకిచ్చిన నెటిజన్
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే ఏది చేసినా ఓ సెన్సేషన్ అవుతుంది. అలా సెన్సేషన్ అవ్వాలనే ప్రత్యేకించి చేస్తుంది. పూనం మాటలైనా, చేతలైనా సరే అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. పెళ్లి చేసుకున్నా సరే, హనీమూన్ కోసం వెళ్లి భర్తపై కేసులు పెట్టినా సరే అది పూనం పాండేకే చెల్లుతుంది. తాజాగా పూనం గోవాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నగ్నంగా నడి రోడ్డు మీద షూటింగ్ చేయడంతో పూనంను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

పెళ్లి వైరల్..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను పూనమ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన భర్తపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. భర్త్ వేధిస్తున్నాడని, ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్నాడని అందుకే విడాకులు అడుగుతోందని వార్తలు వచ్చాయి.

గోవాలో రచ్చ..
ఇటీవల పూనమ్ పాండే అసభ్యంగా పోర్న్ ఫొటోషూట్ చేశారనే ఆరోపణలతో పూనంపై కేసు నమోదు చేశారు. గోవా ప్రభుత్వానికి సంబంధించిన వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రాంతంలో అనుమతి లేకుండా షూట్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేయడం తెలిసిందే.

తాజాగా అలా..
పూనం తాజాగా అభిమానులతో ముచ్చటించింది. సోషల్ మీడియాలో లైవ్ సెషన్‌లోకి వచ్చింది. ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు పూనమ్ ఓపిగ్గా సమాధానాలు చెబుతూ వచ్చింది. అందులో కొందరు ఆకతాయిలు వెరైటీ వెరైటీ ప్రశ్నలు సంధించారు. అన్నింటికి తనదైన శైలిలో స్పందించింది.

నేరుగా అడిగేశాడు..
ఇక ఓ నెటిజన్ మాత్రం పూనమ్ పర్సనల్ విషయాన్ని అడిగేశాడు. నాకు మీ నంబర్ ఏంటో తెలుసుకోవాలని ఉంది డియర్ ప్లీజ్ చెప్పు అంటూ ధీనంగా అడిగేశాడు. అయితే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ పూనమ్ ఎంతో క్యూట్‌గా రిప్లై ఇచ్చింది. నా స్నేహితుడా.. అది కొంచెం పర్సనల్ అంటూ ఇవ్వలేనని పరోక్షంగా చెప్పింది.

ఎప్పుడూ అదే తాగుతాను...
మరో నెటిజన్ మీరు టీ తాగుతారా? కాఫీ తాగుతారా? అని ప్రశ్నించాడు. నేను అలాంటి వ్యక్తిని కాదు.. అవేవీ తాగను.. ఎప్పుడూ నీళ్లే తాగుతాను అని చెప్పుకొచ్చింది. ఇక ఎంతో మంది పూనంకు లవ్యూలు చెప్పేశారు. ఆమె కూడా తిరిగి తన ఫ్యాన్స్‌కు లవ్యూలు చెప్పేసింది.


Click it and Unblock the Notifications











