గజిని రీమేక్‌ని పవన్ ఎందుకు రిజెక్ట్ చేశారు.. ఆ రిస్క్‌ చేయటానికి భయపడ్డారా ..?

విలక్షణ దర్శకుడు ఏఆర్ మురగదాస్- కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం గజిని. 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కథ, స్క్రీన్ ప్లే, సూర్య నటన, నయనతార- అసిన్ అందాలు, మురగదాస్ టేకింగ్, హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్‌ 'గజిని'ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.

మెమెంటో అనే అమెరికన్ మూవీ ఆధారంగా తమిళ నేటివిటీకి తగినట్లుగా కథలు మార్పులు చేర్పులు జోడించి గజిని స్క్రిప్ట్ తయారుచేశారు మురుగదాస్. ఓ సంపన్నుడైన యువకుడు విలన్ల కారణంగా తన ప్రేయసిని కోల్పోయి తీవ్రమైన మతిమరుపు వ్యాధితో బాధపడుతూనే శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడం అనేది స్థూలంగా గజిని సినిమా థీమ్. ఓ రివెంజ్ డ్రామాకు కమర్షియల్ అంశాలు మేళవించి మురగదాస్ సెల్యూలాయిడ్‌పై గజినిని ఆవిష్కరించారు.

power star pawan kalyan revealed why he rejected gajini remake

అయితే గజిని కథను ఏ హీరో దగ్గరికి తీసుకెళ్లినా స్క్రిప్ట్ బాగుందని చెప్పడం, హీరో గెటప్ విషయంలో గుండు కొట్టించుకోవాల్సి ఉండటంతో రిజెక్ట్ చేయడం జరిగిందని స్వయంగా మురగదాస్ తెలిపారు. అజిత్, మాధవన్ వంటి అగ్ర కథానాయకులు సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారట. అలా దాదాపు 12 మంది హీరోల చేతిలో తిరస్కారానికి గురైన గజిని కథ.. చివరికి సూర్య వద్దకు చేరింది. సినిమా కోసం ఎంత రిస్క్‌కైనా ఓకే అని సూర్య భరోసా ఇవ్వడమే కాదు.. షూటింగ్‌కు ముందే జుట్టు మొత్తం తీసేసి ఫోటో షూట్, లుక్ టెస్టులోనే వావ్ అనిపించారట. ఈ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్‌కు సూర్య తన నటనతో జీవం పోశారు. ఆ రోల్‌లో ఆయనను తప్పించి మరొకరిని ప్రేక్షకులు ఊహించుకోలేరంటే అతిశయోక్తి కాదు.

తెలుగు, తమిళ భాషల్లో ప్రభంజనం సృష్టించడంతో పాటు గజిని ద్వారా తెలుగునాట సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఇదే కథను హిందీలోనూ అమీర్‌ఖాన్‌తో గజినినీ రీమేక్ చేసి బంపర్‌హిట్ కొట్టారు మురగదాస్. బాలీవుడ్‌లో రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా గజిని చరిత్రలో నిలిచిపోయింది. హిందీలో తొలుత సల్మాన్ ఖాన్‌తో ఈ సినిమాను తీయాలని భావించినప్పటికీ.. విలన్‌గా చేసిన ప్రదీప్ రావత్ సూచన మేరకు అమీర్‌ఖాన్‌ను ఎంపిక చేశారట.

power star pawan kalyan revealed why he rejected gajini remake

ఇదిలాఉండగా.. గజిని రీమేక్‌లో నటించాల్సిందిగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఆఫర్ వచ్చిందట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గజిని రీమేక్ రైట్స్‌తో మేకర్స్ తనను కలిశారని, అయితే తాను నో చెప్పానని పవన్ వెల్లడించారు. తమిళ సినిమాల్లో ప్రయోగాలు ఎక్కువగా చేస్తారని.. స్టార్ హీరోలు సైతం డీ గ్లామర్ రోల్స్ వేయడానికి వెనుకాడరని ప్రశంసించారు. ఆ టైప్ చిత్రాలను తమిళ ప్రేక్షకులే ఆదరిస్తారని.. మన దగ్గర అలాంటివి సెట్ కావని, తెలుగునాట హీరో అంటే గ్లామర్‌గా, అందంగా కనిపించాలి, నీట్‌గా ఉండాలని కోరుకుంటారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

గజినిలో సూర్య గుండుతో కనిపించి మతిమరుపు వ్యాధితో అదరగొట్టారని.. అలాంటిది నేను గుండు గీయించుకుంటే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుటారా అనేది డౌట్ అన్నారు. ఆ భయంతోనే గజిని రీమేక్‌లో నటించలేదని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ మూవీని తెలుగులో పవన్ కనుక చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదోనంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు

More from Filmibeat

Read more about: pawan kalyan gajini ar murugadoss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X