For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాధేశ్యామ్’పై దారుణమైన ట్రోలింగ్.. ఆ సినిమా పోస్టర్‌కు కాపీ.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్

    |

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు నేడు పండుగ. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసిన క్షణాలు నేడు నిజమయ్యాయి. సినిమా మొదలై ఏళ్లు గడిచినా ఒక్క అప్డేట్ లేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు. ఒకానొక సమయంలో నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌ను బ్యాన్ చేయాలని ఓ క్యాంపైన్ కూడా నడిపారు. అంతలా ఫస్ట్రేట్ అయ్యారు ప్రభాస్ అభిమానులు. అయితే నేడు ప్రభాస్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రావడంతో అంతా సంబరాల్లో మునిగారు.

     ఎట్టకేలకు అప్‌డేట్..

    ఎట్టకేలకు అప్‌డేట్..

    ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓ కూల్ టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. రాధేశ్యామ్ టైటిల్‌లోనే ఏదో అట్రాక్షన్ ఉండగా.. ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఓ అంచనా క్రియేట్ చేశారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్ అని అర్థమవుతోంది.

    కాపీ అంటూ ట్రోల్స్..

    కాపీ అంటూ ట్రోల్స్..

    ఈ మధ్య తెలుగులో ఏ డైరెక్టర్ అయినా అప్ డేట్ ఇచ్చినా కొత్త పోస్టర్‌లను రిలీజ్ చేసినా క్షణాల్లో దాని మూలం ఎక్కడుందో కనిపెట్టేస్తున్నారు. తాజాగా రాధేశ్యామ్ పోస్టర్‌ను కూడా పలు సినిమాలతో పోల్చుతూ కాపీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సాక్ష్యం, కంచె, ఐ, రామ్ లీల వంటి సినిమా పోస్టర్లతో పోల్చుతూ వైరల్ చేస్తున్నారు.

    ఫస్ట్ లుక్‌పై మీమ్స్..

    ఫస్ట్ లుక్‌పై మీమ్స్..

    రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంచె, సాక్ష్యం పోస్టర్లకు దగ్గరగా ఉందని మీమ్స్‌తో సెటైర్స్ వేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం ముందు సంబరాల ముందు ఈ మీమ్స్ నిలబడలేకపోతున్నాయి.

    Prabhas సెల్పీ పై కామెంట్స్, Fitness గాలికొదేలిశాడు | TROLLS
    రాధేశ్యామ్ రికార్డులు..

    రాధేశ్యామ్ రికార్డులు..

    రాధేశ్యామ్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆరుగంటల్లో మిలియన్ లైకులను సాధించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 2.5 మిలియన్ల ట్వీట్లు రాధేశ్యామ్‌పై ఉన్నాయి. నేడు సోషల్ మీడియా మొత్తం రాధేశ్యామ్ జపమే చేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏది ఓపెన్ చేసినా సరే రాధేశ్యామ్ ప్రత్యక్షం అవుతూనే ఉంది.

    English summary
    Prabhas 20 Title Radheshyam Gets Trolls And Copied. Several Memes Created On Radheshyam Look And Trolled Ny Netizens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X