రాజమౌళి తనయుడిని పెళ్లిలో జంటగా ప్రభాస్-అనుష్క సందడి... ఫోటోస్ వైరల్!
Recommended Video

రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి వేడుక ఆదివారం రాత్రి జైపూర్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి తదితరులు సందడి చేయడం తెలుగు సినీ అభిమానులకు కనువిందు చేసింది.
ముఖ్యంగా ప్రభాస్, అనుష్క చాలా కాలం తర్వాత కలిసి ఒకే చోట కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. పెళ్లి మండపంలో ఇద్దరూ జంటగా కలియ తిరుగుతూ హడావుడి చేయడం గమనార్హం. ఈ ఫోటోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

డార్లింగ్-స్వీటీ పెయిర్ సూపర్
ప్రభాస్, అనుష్క ఇద్దరినీ ఒకే చోట ఇలా చూడటంతో అభిమానుల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. డార్లింగ్-స్వీటీ పెయిర్ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్
అనుష్క, ప్రభాస్ గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. బాహుబలి సమయంలో వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది. ఎంతలా అంటే తమ జీవితంలోని బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరికొకరు చెప్పుకునేంతలా!

వీరిపై గతంలో పెళ్లి రూమర్స్
వీరి మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ చూసి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ సైతం గతంలో హల్ చల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేదని, తాము సింగిల్ గానే ఉన్నామని అనుష్క, ప్రభాస్ స్పష్టం చేశారు.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఎవరు అంటే... ముందుగా ప్రభాస్, అనుష్క పేర్లే వినిపిస్తున్నాయి. ఇద్దరూ వయసు పైబడుతున్నా పెళ్లి ఆలోచన చేయడం లేదు. ఈ విషయంలో కుటుంబు సభ్యులతో పాటు అభిమానుల విన్నపాలను సైతం పట్టించుకోవడం లేదు.


Click it and Unblock the Notifications











