సాహో ప్రభాస్.. ఆయన ధరించిన వాచ్ ఖరీదు తెలిస్తే అవాక్కవాల్సిందే?

Recommended Video

Prabhas Appeared With Costly Watch In Saaho Pre Release Event || Filmibeat Telugu

సినిమాల పరంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలుసు. బాహుబలి సిరీస్‌తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు సాహో రూపంలో మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 30 వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుండటంతో దేశమంతా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ లోగా ప్రభాస్ రేంజ్ తెలిపేలా మరో ఇష్యు తెరపైకి వచ్చింది. వివరాల్లోకి పోతే..

Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్

గత ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సాహో అత్యంత ఘనంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కి దర్శక ధీరుడు రాజమౌళి సహా వీవీ వినాయక్, దిల్ రాజు, అల్లు అరవింద్ ముఖ్య అతిధులుగా విచ్చేసి సాహో రేంజ్ తెలిపారు. కానీ ఈవెంట్ మొత్తంలోను అందరిలో డార్లింగ్ ప్రభాస్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.

కెమెరా కళ్లన్నీ అక్కడే..

కెమెరా కళ్లన్నీ అక్కడే..

అశేష అభిమానుల నడుమ అంగరంగవైభవంగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ధరించిన కాస్ట్యూమ్స్ అందరినీ ఆకర్షించాయి. ముఖ్యంగా ఆయన ధరించిన వాచ్ ఎంతో స్పెషల్ కావడంతో కెమెరా కళ్లన్నీ అక్కడే పడ్డాయి. దీంతో ఆ వాచ్ ఏ కంపెనీ, దాని ఖరీదెంత? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి జనాల్లో.

ఓ రేంజ్‌లో వెతికి ఆ రేంజ్ తెలుసుకున్నారు

ఓ రేంజ్‌లో వెతికి ఆ రేంజ్ తెలుసుకున్నారు

ప్రభాస్ ధరించిన వాచ్ తాలూకు వివరాలను గూగుల్ లో ఓ రేంజ్‌లో వెతికారు నెటిజన్లు. చివరకు ఆ వాచ్ రేంజ్ ఏంటో తెలుసుకొని అవాక్కయ్యారు. అది హబ్లట్ కంపెనీకి చెందిన వాచ్ అని, దాని ఖరీదు సుమారుగా 50 లక్షల నుంచి కోటి వరకూ ఉంటుందని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వాచ్ గురించిన చర్చలు మరింత ముదిరాయి.

ఇదీ రేంజ్ అంటే! సాహో ప్రభాస్

ఇదీ రేంజ్ అంటే! సాహో ప్రభాస్

ప్రభాస్ వాచ్, ఆయన హుందా తనం చూసి 'ఇదీ రేంజ్ అంటే! సాహో ప్రభాస్' అంటూ తెగ సంబరపడిపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ''గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ వుంటది'' అంటూ సాహో ట్రైలర్‌లో ప్రభాస్ చెప్పిన మాటలు తలచుకుంటూ.. రియల్ లైఫ్ లోనూ తమ అభిమాన హీరో రేంజ్ ఇదీ అంటూ మురిసిపోతున్నారు.

సాహో మూవీ

సాహో మూవీ

యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ఏ, విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 30న 'సాహో' విడుదల కానుంది. చిత్రంలో ప్ర‌భాస్ సరసన శ్రధ్ధాక‌పూర్‌ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, వెన్నెల కిషోర్‌, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X