Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డార్లింగ్ స్టైలీష్ లుక్కు ఫిదా.. ‘రాధేశ్యామ్’లో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే టైం వచ్చేసింది. ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) కంటే ముందే ఓ శాంపిల్‌ను వదిలారు. పుట్టిన రోజు రాకముందే పండుగను తీసుకొచ్చింది యూవీ క్రియేషన్ టీం. రాధేశ్యామ్ నుంచి ఓ అప్డేట్ ఇచ్చి అందర్ని సంబరాల్లో ముంచెత్తింది. పూజా హెగ్డే బర్త్ డే (అక్బోర్ 13)న ఆమె పాత్రకు సంబంధించిన పేరు, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ప్రభాస్ అల్ట్రా స్టైలీష్ లుక్‌ను రిలీజ్ చేశారు.
రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడోనన్న క్లారిటీ ఓ ఒక్కరికీ సరిగ్గా లేదు. రాధేశ్యామ్ టైటిల్ పోస్టర్లో ఉన్న ప్రభాస్‌ను చూస్తే సినిమాలోని లుక్‌పై అంతగా క్లారిటీ రాలేదు. సినిమా మొదలెట్టి ఏడాదికి పైనే అవుతున్నా ప్రభాస్‌ను చూపించడం లేదని ఫ్యాన్స్ మండిపడ్డారు. కానీ ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారు. అంతకంటే మునుపే ఓ సర్ ప్రైజ్ ఇచ్చి షాక్ చేశారు.
రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్య అనే పాత్రలో నటించబోతోన్నాడని ప్రకటించారు. ఇక స్టైలీష్‌గా ఓ పోజు ఇచ్చిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ తెలిపారు. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ మోషన్ పోస్టర్ రెడీ అవుతోందన్న సంగతి తెలిసిందే. దానికి డియర్ కామ్రేడ్ ఫేం జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే సంగీతాన్ని సెట్ చేస్తున్నాడట. ఇక డార్లింగ్ బర్త్ డే ఓ పండుగలా మారనుందని తెలుస్తోంది.