For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘రాధేశ్యామ్’ స్టోరీ లీక్.. మోషన్ పోస్టర్ చెబుతోంది అదేనా?

    |

    ఓ సినిమా పోస్టర్ మోషన్ పోస్టర్ టీజర్ ట్రైలర్ ఇలా ఏదైనా సరే. దాని ఉద్దేశ్యం మాత్రం సినిమా ఎలా ఉండబోతోంది.. దాని కథా కమామీషు ఎలా ఉంటాయని శాంపిల్‌గా చెప్పడం కోసమే వాటిని రిలీజ్ చేస్తుంటారు. ఇక నేడు డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్నో క్లూలు వదిలేశారు. ఇక స్టోరీ ఎలా ఉండబోతోందన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి. అసలు మోషన్ పోస్టర్‌లో వదిలిన క్లూస్ ఏంటన్నవి ఓ సారి చూద్దాం.

    రాధేశ్యామ్ పేరులోనే..

    రాధేశ్యామ్ పేరులోనే..

    మామూలుగా ఈ కథ ఏంటన్నది టైటిల్‌లోనే ఉంది. రాధేశ్యామ్ అంటే రాధా కృష్ణులు అని అర్థం. ప్రేమకు ప్రతిరూపంగా ఈ ఇద్దరిని చెప్పుకుంటారు. కానీ చివరకు వీరి కథ మాత్రం సుఖాంతం కాదు. గుండెల నిండ ప్రేమ ఉన్నా కూడా ఈ ఇద్దరూ జీవితంలో కలవలేదు. దూరంగానే ఉండిపోయారు. అలా వారి పేర్లను ఇక్కడ ప్రస్థావించి టైటిల్‌గా పెట్టడం, తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లోనూ అలాంటి కొన్ని ప్రేమ జంటల ఆనవాళ్లు ఇవ్వడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

    మోషన్ పోస్టర్‌లో..

    మోషన్ పోస్టర్‌లో..

    మోషన్ పోస్టర్‌లో ఉన్న ట్రైన్‌ అందులో ఒక్కో కంపార్ట్మెంట్‌లో ఒక్కో ప్రేమగాథను చూపించాడు. దేవదాస్ పార్వతి, సలీం అనార్కలీ, రోమియో జూలియెట్ ఇలా చరిత్రలో గొప్ప ప్రేమికులందరినీ చూపించాడు. వీరి తరువాత ఉన్న కంపార్ట్మెంట్‌లో ప్రేరణ (పూజా హెగ్డే), విక్రమ్ ఆదిత్య (ప్రభాస్)లను చూపించాడు.

    అన్నీ విషాద గాథలే..

    అన్నీ విషాద గాథలే..

    మోషన్ పోస్టర్‌లో చూపించిన ప్రతీ ఒక్కటి విషాద గాథే. పారు దేవదాస్ చివరకు కలుసుకోనేలేదు. రోమియో జూలియట్, సలీం అనార్కలీ కథలు అందరికీ తెలిసిందే. ఇలా అందర్నీ ఒకే చోట చూపించి తరువాత ప్రభాస్ పూజాహెగ్గేల అందమైన జంటను చూపించడంతో ఇది కూడా విషాద గాథే అని అర్థమవుతోంది.

    #BeatsOfRadheShyam : New Motion-Poster Released From Radhe Shyam
     ఇటలీ బ్యాక్ డ్రాప్..

    ఇటలీ బ్యాక్ డ్రాప్..

    అయితే ఇలాంటి విషాద గాథకు ఇటలీ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం కాస్త ఫ్రెష్‌గా అనిపించొచ్చు. అయితే ఈ కథ విషాదాంతం అయినా చివరకు పూజా హెగ్డే పాత్ర ముగుస్తుందా? లేదా ప్రభాస్ పాత్ర ముగుస్తుందా? అసలు సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఇన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులకు ఉన్న ఆకలిని ఈ మోషన్ పోస్టర్ తీర్చేసింది.

    English summary
    Prabhas Beats Of Radhe Shyam Review, Prabhas Beats Of Radhe Shyam Review, Needless to say, Prabhas' craze, which entered Tollywood as the successor of Rebel star Krishna Raju, is now at a special level. Prabhas, who rose to be the king of the box office with the film Bahubali, is celebrating his 41st birthday today. And millions of fans are offering him his best birthday wishes. Celebrities are also wishing Prabhas a happy birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X