ప్రభాస్ మరో ‘సోషల్’ రికార్డు.. మిలియన్ ట్వీట్లు!
బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది. బాహుబలి2 రిలీజై ఏడాదిన్నర కావోస్తున్నా ఇంకా ప్రభాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదని తాజాగా ఓ సోషల్ మీడియా పోస్టింగ్ రుజువు చేసింది.
ప్రభాస్ జన్మదినం అక్టోబర్ 23. యంగ్ రెబల్‌స్టార్ బర్త్ డే మరో 50 రోజులు ఉందంటూ ఇటీవల ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు పది లక్షల (ఒక మిలియన్) ట్వీట్లు నమోదైనట్టు సమాచారం.

అన్నిచోట్ల జరిగే గ్రాండ్‌గా జరిగే మాస్ సెలబ్రిషన్‌కు సిద్ధం కావాలి అంటూ ఆ పోస్టర్‌పై ఓ ట్యాగ్ లైన్ రాశారు.
ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. బాహుబలి తర్వాత ఈ చిత్రం వస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











