‘సాహో’ నెగెటివ్ టాక్‌పై నిజాయితీగా స్పందించిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సాహో' ఆగస్టు 30న విడుదలై మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సినిమా కలెక్షన్లు మాత్రం బావున్నాయి. తొలి 5 రోజుల్లోనే రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసింది. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ సినిమాకు ఆదరణ పెరగడానికి కారణం ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ చేస్తున్న కృషి అంటున్నారు.
డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది సినిమాను వీలైనన్ని ఎక్కువ సార్లు చూడటంతో పాటు నెగెటివిటీని పోగొట్టి... పాజిటివ్ టాక్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద మణిరత్నం అనే డైహార్డ్ ఫ్యాన్ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ... ఆల్రెడీ సినిమాను 3 సార్లు చూశాను. ఇపుడు నాలుగోసారి చూడటానికి వచ్చినట్లు తెలిపారు.

అలా జరిగి ఉంటే రూ. 500 కోట్లు వచ్చేవి
సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంటే కలెక్షన్లు ఇప్పటి ఓ రేంజిలో ఉండేవి. రూ. 500 కోట్ల క్రాస్ అయ్యేది. నెగెటివ్ వచ్చినా కూడా డే 1 రికార్డ్ కొట్టిందంటే అది కేవలం ప్రభాస్ మీద జనాల్లో ఉన్న క్రేజ్.

సినిమా జనాలకు రీచ్ అవుతోంది
సినిమాపై ఇప్పుడిప్పుడే పాజిటివ్ ఓపీనియన్ వస్తోంది. జనాలకు ఇంకా కొంచెం రీచ్ అయితే మంచి వసూళ్లు వస్తాయి. ఇంకా చాలా సమయం ఉంది. 2 నెలల లాంగ్ రన్ తప్పకుండా ఉంటుంది. సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్స్ సినిమాను తప్పకుండా 2 నెలలు నడిపిస్తారని మణిరత్నం చెప్పుకొచ్చారు.

అందుకే తొందరగా ఎక్కడం లేదు
టాలీవుడ్లో ‘సాహో' లాంటి మూవీ రావడం తొలిసారి. హాలీవుడ్ ఫార్మాట్లో సినిమా ఉండటంతో జనాలకు ఎక్కడంలో కాస్త ఆలస్యం అవుతోంది. మొదటి సారి చూసిన వారికి సరిగా అర్థం కావడం లేదు. రెండోసారి చూస్తే తప్పకుండా అర్థమవుతుందని మణిర్నతం చెప్పుకొచ్చారు.

సాహో మరీ అంత దారుణంగా ఏమీ లేదు
‘సాహో' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 350 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్, వినాయక చవితి కలిసి రావడంతో వసూళ్ల పరంగా కలిసి వచ్చింది. హిందీలో 5 రోజుల్లోనే రూ. 100 కోట్లు రీచ్ అయింది. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ 1.5/5 రేటింగ్ ఇచ్చినట్లు అంత చెత్తగా ఏమీ లేదు, ఆయన ఇచ్చి రేటింగ్ కంటే చాలా బెటర్‌గా సినిమా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











