అనుష్క విషయంలో బాధ్యతలు తీసుకున్న ప్రభాస్.. ఎంత దూరమైన వస్తానని హామీ.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువ రోజులు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో అనుష్క శెట్టి ఒకరు. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ టాలెంటెడ్ హీరోయిన్.. ఆ తర్వాత దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరితోనూ నటించింది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డులకు ఎక్కింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేసి మెప్పించింది. తాజాగా ఈమె వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం అనుష్క కోసం ప్రభాస్ ఓ పని చేయబోతుండడమే. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఏంటా పని.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ సినిమానే స్టార్ హీరోయిన్‌ను చేసింది
అనుష్క టాలెంటెడ్ హీరోయిన్‌గా కితాబందుకుంది. ఈ క్రమంలోనే వచ్చిన ‘అరుంధతి' అనే సినిమా ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో నంది పురస్కారాలని అందుకుంది. అప్పటి నుంచి అనుష్క వెనుదిరిగి చూసుకోలేదు.

సినిమా కోసం చేసిన ప్రయోగం వికటించింది
‘సైజ్ జీరో' అనే సినిమా కోసం అనుష్క బాగా లావు పెరిగిపోయింది. ఈ సినిమాకు ముందు వరకు ఎంతో స్లిమ్‌గా ఉన్న ఆమె.. దీని తర్వాత ఇప్పటి వరకూ అప్పటి ఫిజిక్‌ను సాధించలేకపోయింది. దీంతో ఆమె సినిమాలకూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాహుబలి సినిమాకు కూడా అనుష్క ఫిజిక్ సమస్యలు తెచ్చిపెట్టిందని ఆ మధ్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

త్వరలోనే ప్రభాస్‌తో అనుష్క పెళ్లి
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హాట్ టాపిక్ అయిన వార్తల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి ఒకటి. వీళ్లిద్దరూ ఇప్పటి వరకు మూడు సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో ‘బాహుబలి' సిరీస్ కోసమే దాదాపు ఐదేళ్లు కలిసి ట్రావెల్ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి.

అనుష్క కోసం హామీ ఇచ్చిన ప్రభాస్
ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేశారు. ఇందులో భాగంగానే త్వరలోనే జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. ఫంక్షన్ ఎక్కడున్నా హాజరవుతానని చిత్ర యూనిట్‌కు హామీ కూడా ఇచ్చాడని సమాచారం.

నిశ్శబ్ధంగా పని చేసేస్తున్నారు
అనుష్క శెట్టి ప్రస్తుతం హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ‘నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. ప్రయోగాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో మాధవన్, అంజలి సహా ఎంతో మంది నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌తో రూపొందుతోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











