ప్రభాస్ లుక్‌పై పెదవి విరుపు.. ప్యాన్ ఇండియా స్టార్ సరుకు ఇది కాదంటూ టాక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఇప్పుడు కేవలం తెలుగు హీరో అని మాత్రమే అనలేము. ఆయన ఆ సరిహద్దులను ఎప్పుడో చెరిపేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్. ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆయన కనబడాల్సి ఉంటుంది. ఓ ప్యాన్ ఇండియా స్టార్ అంటే అందరి కళ్లు అటు వైపే తిరుగుతాయి. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చూస్తారు. తాజాగా ప్రభాస్ లుక్‌పై భిన్న రకాల కామెంట్స్ వినిపించాయి. కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాడా? అని టాక్ నడుస్తోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

ప్రభాస్ పిక్స్ వైరల్..
తాజాగా మూడో దశ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రభాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన స్వగృహంలో మొక్కలు నాటాడు. అందులో భాగంగా సంతోష్ కుమార్‌తో సెల్పీ దిగి తన మొక్కలను అభిమానులకు చూపించాడు. ఈ ఫోటోల్లో ప్రభాస్ లుక్‌ను అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కవర్ చేసినా..
అయితే ప్రభాస్ తన ఫిట్‌నెస్‌ను కవర్ చేసేందుకు వదులుగా ఉన్న లాంగ్ టీ షర్ట్‌ను వేశాడు. అయితే అందులోనూ విఫలమయ్యాడు. ప్రభాస్ లుక్‌పై, ఫిట్‌నెస్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్ నడుస్తున్నాయి. స్టార్స్ అందరూ తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూ ఉంటే ప్రభాస్ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాడని అంటున్నారు.

గతంలోనూ ఇలాగే..
ప్రభాస్ గతంలోనూ ఇలాగే ఫిట్‌నెస్‌ను గాలికొదేలిశాడు. మిర్చి సినిమా సమయంలో ఫిట్‌నెస్‌పై శ్రద్దగా చూపకపోయే సరికి కొన్ని సీన్స్‌లో లావుగా కనిపిస్తూ ఉంటాడు. మరికొన్ని సీన్స్‌లో ఫిట్‌గా ఉంటాడు. షూటింగ్‌లకు కాస్త గ్యాప్ దొరికితే ప్రభాస్ రెస్ట్ తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

లాక్‌డౌన్ వల్లే..
అయితే గత రెండు మూడు నెలలుగా లాక్ డౌన్ ఉండటం, షూటింగ్‌లు లేకపోవడంతో ప్రభాస్ కాస్త రిలాక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే అలా లావయ్యాడని టాక్. అయితే మిగతా హీరోలు మాత్రం ఈ సమయాన్ని కూడా వదలకుండా తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే.. ప్రభాస్ మాత్రం ఇలా గాలికొదిలేశాడు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











