ఏ సినిమాకూ దక్కని ఘనతను సొంతం చేసుకున్న ‘సాహో’.. ఇండియాలోనే టాప్ ప్లేస్.!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 'సాహో' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రమోషన్ షురూ

ప్రమోషన్ షురూ

త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీని తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది సాహో యూనిట్. ఇక, ముంబైలో కొద్దిరోజులుగా ప్రభాస్ హవా కనిపిస్తోంది. దీంతో సాహో తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్నో రికార్డులు సొంతం

ఎన్నో రికార్డులు సొంతం

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. భారతదేశ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘సాహో' ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్, ఎక్కువ లొకేషన్లు, ఏరియాల వారీగా భారీ మొత్తానికి అమ్ముడు పోవడం, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ అత్యధిక ధర పలకడం వంటివి రికార్డులు బద్దలు కొట్టాయి. ఇవే కాదు చాలా విభాగాల్లో ఈ సినిమా అరుదైన ఘనతలు సొంతం చేసుకుంది.

దక్షిణాదిలో ప్రభాస్ ఒక్కడే

దక్షిణాదిలో ప్రభాస్ ఒక్కడే

‘సాహో' సినిమాను ప్రపంచంలోనే పెద్దదైన గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇది పారిస్‌లో ఉంది. ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది కూర్చుని సినిమా చూసే అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ గతంలో ‘బాహుబలి'ని కూడా ఇక్క ప్రదర్శించారు. అయితే, మరే తెలుగు హీరో సినిమా ఇక్కడ ప్రదర్శితం కాలేదు. అలాగే, దక్షిణాది నుంచి ఇప్పటి వరకు ‘కబాలి', ‘మెర్సల్‌', ‘విశ్వరూపం 2' మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి. అంటే.. ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇప్పుడు మరో ఘనత

ఇప్పుడు మరో ఘనత

ఇక, తాజాగా ‘సాహో' ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. సోషల్ మీడియాలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ట్విట్టర్.. ట్రెండింగ్‌లో ఉండే సినిమాలకు ఎమోజీలు తయారు చేస్తుంది. గతంలో హాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలకు ఇలా చేసింది. ఇప్పుడు ‘సాహో'కు కూడా ట్విట్టర్ ఓ ఎమోజీని తయారు చేసింది. ఇలా ట్విట్టర్ ఎమోజీని పొందిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో' రికార్డులకెక్కింది. అంతేకాదు, ప్రస్తుతం ‘సాహో ఎమోజీ' ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండడం విశేషం.

సాహో గురించి

సాహో గురించి

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X