వెరీ ఇంట్రెస్టింగ్: సాహో కోసం వాళ్లంతా రాష్ట్రం మారిపోతున్నారు.. ఒక్కో టికెట్ రూ. 2000

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 'సాహో' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రమోషన్ షురూ

ప్రమోషన్ షురూ

త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీని తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది సాహో యూనిట్. ఇక, ముంబైలో కొద్దిరోజులుగా ప్రభాస్ హవా కనిపిస్తోంది. దీంతో సాహో తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్నో రికార్డులు సొంతం

ఎన్నో రికార్డులు సొంతం

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. భారతదేశ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘సాహో' ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్, ఎక్కువ లొకేషన్లు, ఏరియాల వారీగా భారీ మొత్తానికి అమ్ముడు పోవడం, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ అత్యధిక ధర పలకడం వంటివి రికార్డులు బద్దలు కొట్టాయి. ఇవే కాదు చాలా విభాగాల్లో ఈ సినిమా అరుదైన ఘనతలు సొంతం చేసుకుంది.

రాష్ట్రాలు మారిపోతున్నారు

రాష్ట్రాలు మారిపోతున్నారు

ఇక, సాహో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారమే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే, ఇవి అన్ని చోట్ల కాదు.. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. అందుకే సాహో సినిమాను అందరి కంటే ముందు చూడాలనుకునే వారు తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వస్తున్నారట. దీంతో అక్కడి షోలకు భారీ ధరలు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో టికెట్ రూ. 2000

ఒక్కో టికెట్ రూ. 2000

గురువారం ప్రదర్శితమయ్యే ప్రీమియర్ షోల కోసం భారీ ధరలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ప్రత్యేకంగా పర్మీషన్లు తీసుకుని వేయించుకునే ఈ షోలకు ఒక్కో టికెట్ రూ. 2000 వరకు పలుకుతున్నట్లు సమాచారం. ఆయా షోలకు సంబంధించి టికెట్లు కూడా ఇప్పటికే అమ్ముడైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టికెట్లను ప్రభాస్ అభిమానులే కాకుండా వేరే వాళ్లు కూడా కొంటున్నారని టాక్.

సాహో గురించి

సాహో గురించి

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X