కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. మా వాళ్ల కంటే మీకే ఎక్కువ శ్రద్ద.. ప్రభాస్ క్లారిటీ

టాలీవుడ్‌లో ఎప్పుడైనా హాట్ టాపిక్ లేకపోతే ప్రభాస్‌ను వాడేస్తుంటారు. ప్రభాస్ పెళ్లి విషయం గత కొన్నేళ్లుగా నానుతూ వస్తోన్న వ్యవహారం. ఇది ఓ పట్టాన ముగిసే అంశం కాదని అందరికీ తెలుసు. అందుకే ఏవేవో వార్తలు వడ్డించేస్తుంటారు. ఆ వార్తల్లో నిజముందా లేదా అన్నది ఎవ్వరికీ అవసరం లేదు. అది ప్రభాస్ పెళ్లి వార్త అయితే చాలు.. విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ప్రభాస్ పెళ్లి అని, కృష్ణం రాజు ఓ అమ్మాయిని చూసేశాడని కాదు కాదు అనుష్కతో పెళ్లి అని, అయ్యే ఆ లిస్ట్‌లో నిహారిక కొణిదెల కూడా ఉందని ఎవరికి తోచిన వార్తలు వారు రాస్తుంటారు. తాజాగా ప్రభాస్ తన పెళ్లి వార్తలపై స్పందించాడు. ఇంతకీ ప్రభాస్ చెప్పిన సమాధానం ఏంటో ఓ సారి చూద్దాం.

పెళ్లి వార్తలు వైరల్..

పెళ్లి వార్తలు వైరల్..

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి వార్త ఒక సెన్సేషన్. అది ఎవరితో జరుగుతుందనేది ఇప్పటివరకు మీడియా సృష్టించినదే. అయితే ఎన్నిసార్లు ఆ వార్తలను ఖండించినా మల్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. తామిద్దరం స్నేహితులమేనని అనుష్క, ప్రభాస్ ఎన్ని సార్లు చెప్పినా.. ముడిపెడుతూనే ఉంటారు.

ఖండించిన నిహారిక..

ఖండించిన నిహారిక..

ప్రభాస్‌తో మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి జరుగుతుందని మీడియా ఓ రేంజ్‌లో వార్తలు రాసేసింది. వీటిపైనా చిరంజీవి, నాగబాబు ఎన్నోసార్లు స్పందించి ఖండించారు కూడా. తాజాగా నిహారిక సైతం ప్రభాస్‌తో పెళ్లి వార్తలను తోసిపుచ్చింది.

కచ్చితంగా చేసుకుంటా..

కచ్చితంగా చేసుకుంటా..

ఇలా ఇన్ని రకాలు హల్చల్ చేస్తున్న తన పెళ్లి వార్తలపై ప్రభాస్ స్పందించాడు. తనకు పెళ్లంటే అయిష్టం, విముఖత వంటివేవీ లేవని కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.

Recommended Video

#Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?
మా వాళ్ల కంటే మీకే ఎక్కువ శ్రద్ద..

మా వాళ్ల కంటే మీకే ఎక్కువ శ్రద్ద..

అసలు నా పెళ్లి విషయం మా ఇంట్లో వారికంటే మీడియా వారికే ఎక్కువ శ్రద్ద ఉందని కౌంటర్ వేశాడు. నా పెళ్లి జరగుతుంది.. కానీ ఎప్పుడనేది చెప్పలేను. అనుష్క, నిహారిక, భీమవరం పిల్లతో పెళ్లి వార్తలు విని నవ్వుకున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X