2020 బెస్ట్ సెలెబ్రిటీల జాబితాలో ప్రభాస్: టాప్ 10లో ఐదుగురు ఇండియన్స్.. అగ్రస్థానంలోనూ మన నటుడే!

పేరుకు తెలుగు హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి అతడు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యూకే ఈస్టర్న్ మ్యాగజైన్ సంస్థ ప్రకటించిన 'టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ లిస్ట్ ఇన్ ద వరల్డ్ 2020' జాబితాలో అతడు చోటు దక్కించుకున్నాడు. అలాగే, ఈ లిస్టులో ఓ రియల్ హీరో సహా మొత్తం ఐదుగురు స్థానం సంపాదించుకున్నారు. పూర్తి వివరాలు మీకోసం!

బెస్ట్ సెలెబ్రిటీల లిస్టులో రియల్ హీరో టాప్

బెస్ట్ సెలెబ్రిటీల లిస్టులో రియల్ హీరో టాప్

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యూకే ఈస్టర్న్ మ్యాగజైన్ సంస్థ చేపట్టిన ‘టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ లిస్ట్ ఇన్ ద వరల్డ్ 2020' జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రముఖ నటుడు సోనూ సూద్. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న ఆయనకు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

‘అరవింద సమేత' సింగర్‌ అరుదైన రికార్డు

‘అరవింద సమేత' సింగర్‌ అరుదైన రికార్డు

బాలీవుడ్‌లోని స్టార్ సింగర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు యంగ్ సెన్సేషన్ అమ్రాన్ మాలిక్. హిందీలో సినిమా పాటలు, పాప్ సాంగ్స్‌తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అతడు.. తెలుగులోనూ ‘అరవింద సమేత', ‘కాటమరాయుడు', ‘తొలిప్రేమ', ‘మిస్టర్ మజ్నూ' సహా ఎన్నో చిత్రాల్లో పాటలు పాడాడు. ఈ సింగర్‌ సెలెబ్రిటీల జాబితాలో ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు.

బాలీవుడ్ బ్యూటీ ఖాతాలో మరో గౌరవం

బాలీవుడ్ బ్యూటీ ఖాతాలో మరో గౌరవం

ఎన్నో ఏళ్లుగా ఇండియన్ ఫిల్మ్స్‌లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. 2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ఆమె.. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉంది. నిక్ జోనస్‌ను వివాహమాడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అయింది. ఈ నేపథ్యంలోనే తాజా జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.

అరుదైన ఘనత యంగ్ రెబెల్ స్టార్ సొంతం

అరుదైన ఘనత యంగ్ రెబెల్ స్టార్ సొంతం

వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ పాపులర్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో అతడు విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ లిస్ట్ ఇన్ ద వరల్డ్ 2020' జాబితాలో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డుల్లోకి ఎక్కాడీ పాన్ ఇండియా స్టార్.

బుల్లితెర నటికి దక్కిన అరుదైన ఘనత

‘టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ లిస్ట్ ఇన్ ద వరల్డ్ 2020' జాబితాలో భారతదేశం నుంచి టాప్ -10లో చోటు దక్కించుకున్న మరో నటి సురభీ చంద్ర. 2009 ‘తారక్ మెహ్‌తా కా ఊల్తా ఛెష్మా' అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఈమె.. అప్పటి నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన జాబితాలో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.

మిగిలిన ఐదుగురి పూర్తి వివరాలు ఇవే

మిగిలిన ఐదుగురి పూర్తి వివరాలు ఇవే

యూకే ఈస్టర్న్ మ్యాగజైన్ సంస్థ ప్రకటించిన జాబితాలో ఇతర దేశాలకు చెందిన వారి వివరాలు చూస్తే... రెండో స్థానంలో కెనడాకు చెందిన లిల్లీ సింగ్, మూడో స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన పాప్ సింగర్ చార్లీ, ఫోర్త్ ప్లేస్‌లో లండన్‌కు చెందిన నటుడు దేవ్ పాటేల్, ఎనిమిదో స్థానంలో అమెరియక్ నటి మిండీ కాలింగ్, పదో స్థానంలో అమెరికన్ కమెడియన్ కుమాలీ నాంజియాన్ ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X