Prabhas wishes Saif Ali Khan: భర్తతో అర్ధనగ్నంగా కరీనాకపూర్.. రొమాంటిక్ ఫోటోను సమంత లైక్ కొట్టి ఏం చేసిందంటే!

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్ తన 51వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సైఫ్ ఆలీ ఖాన్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. వివాదాల మధ్య జన్మదినం జరుపుకొంటున్న సైఫ్ ఆలీ ఖాన్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖులు విషెస్ అందజేయగా, భార్య కరీనా కపూర్ రొమాంటిక్ బర్త్ డే విషెస్ అందజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కరీనా దంపుతలపై దారుణంగా ట్రోలింగ్

కరీనా దంపుతలపై దారుణంగా ట్రోలింగ్

గత కొద్ది రోజుల క్రితం తన రెండో కొడుకు జహంగీర్ అని నామకరణం చేసిన విషయం బయటకు రాగానే నెటిజన్లు కరీనా కపూర్ దంపతులను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. భారత దేశంపై దండెత్తి హిందువులను ఊచకోత కోసిన రాజుల పేర్లు పెట్టుకోవడం ఏమిటనే ప్రశ్నలను వారిపై సంధించారు. అలా రెండో కొడుకు పేరు వివాదాస్పదమైంది. గతంలో తన మొదటి కుమారుడు తైమూర్ పేరు కూడా వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ హార్ట్ ఫుల్ మెసేజ్

ప్రభాస్ హార్ట్ ఫుల్ మెసేజ్

ఇలాంటి వివాదాల నేపథ్యంలో సైఫ్ ఆలీ ఖాన్ తన బర్త్ డే జరుపుకోవడానికి సిద్ధం కాగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన శుభాకాంక్షలు అందించారు. సైఫ్ ఆలీ ఖాన్ జీ.. మీకు హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. ఆదిపురుష్‌లో రావణుడి పాత్రలో చూడటానికి చాలా ఉత్సాహ పడుతున్నాను అంటూ ప్రభాస్ తన ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బర్త్ డే విషెస్‌ను పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ వైరల్ అయింది.

కరీనా కపూర్ ఎమోషనల్ పోస్టు.. సమంత లైక్ కొట్టి

కరీనా కపూర్ ఎమోషనల్ పోస్టు.. సమంత లైక్ కొట్టి

తన భర్త సైఫ్ ఆలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా చాలా రొమాంటిక్‌గా కరీనాకపూర్ స్పందించారు. నా లవ్ లైఫ్‌కు హ్యాపీ బర్త్ డే. నీ కంటే నా జీవితంలో మరో అద్భుతమైన ప్రపంచం ఉండదనుకొంటాను. ఎలాంటి ప్రపంచం ఉన్నా అది నీ తర్వాతే అనే విధంగా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్టును ఏకంగా సమంత అక్కినేని లైక్ కొట్టడంతో వైరల్ అయింది. ఈ పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోనే సుమారు 8 లక్షలకుపైగా లైకులు, పెద్ద ఎత్తున్న కామెంట్లు రావడం గమనార్హం.

మాల్దీవుల్లో రొమాంటిక్ ఫోటోను

మాల్దీవుల్లో రొమాంటిక్ ఫోటోను

ఇక తన భర్త సైఫ్ ఆలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా తైమూర్‌తో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లిన ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. బీచ్‌లో ముద్దొచ్చే తైమూర్ ఆలీ ఖాన్‌తో కలిసి సమయాన్ని స్పెండ్ చేస్తూ ఆ ఫోటోలో కనిపించారు. అలాగే సముద్రంలో అర్ధనగ్నంగా రొమాంటిక్‌ జలకాలడుతూ ఉన్న ఫోటోను షేర్ చేసి మరోసారి మధురస్మృతులను గుర్తు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి.

సైఫ్ ఆలీ ఖాన్ కెరీర్ ఇలా..

సైఫ్ ఆలీ ఖాన్ కెరీర్ ఇలా..

సైఫ్ ఆలీ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఆది పురుష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయన నటించిన బూట్ పోలీస్ అనే చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, యామీ గౌతమ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే విక్రమ్ వేద రీమేక్‌లో హృతిక్ రోషన్‌తో మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X