సండే మూడ్ అంటూ ప్యాంట్ బటన్ విప్పేసింది.. నాభి అందాలతో ప్రగ్యా జైస్వాల్ రచ్చ
ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో పుట్టించే సెగల గురించి అందరికీ తెలిసిందే. తెరపై ఎంత పద్దతిగా కనిపించినా కూడా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తుంటుంది. అలా హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంటుంది కాబట్టే సినిమాలు లేకపోయినా కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. ప్రతీ రోజూ ఏదో రకమైన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా సండే మూడ్ అంటూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.

సినిమాలు కలిసి రాలేదు..
ప్రగ్యా జైస్వాల్‌కు ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఒక్క హిట్ కూడా పడలేదు. కంచె అనే ఒక్క చిత్రం మాత్రం మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ అది కమర్షియల్ హిట్ కాలేదు. అలా ప్రగ్యాకు పేరు వచ్చినా కూడా అంతగ ఆఫర్లు మాత్రం రాలేదు.

అన్నీ ఫ్లాపులే..
ప్రగ్యాకు ఆఫర్లు వచ్చినా కూడా అవి అంతగా సఫలం కాలేదు. ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి తన సినీ కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి. ప్రగ్యా నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

సోషల్ మీడియాలో రచ్చ..
అయితే ప్రగ్యా మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. బీచ్‌లు, యోగాలు, వర్కవుట్లు అంటే అందాలను ఆరబోస్తుంది. బికినీలో అందాల విందు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సండే మూడ్ అంటూ..
సండే మూడ్ ఇలా ఉంటుందంటూ ప్రగ్యా జైస్వాల్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంట్ బటన్ విప్పేసింది. ఇక ఒళ్లు విరచుకుంటున్నట్టుగా ప్రగ్యా పోజులు ఇవ్వడంతో నాభి, ఎద అందాలను అందరికీ కనిపించాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

మంచి ఆఫర్..
ప్రగ్యా జైస్వాల్‌కు ఇప్పుడు మంచి ఆఫర్ వచ్చింది. బాలయ్య బోయపాటి కాంబోలో వస్తోన్న సినిమాలో ప్రగ్యాకు ఆఫర్ లభించింది. అంతేకాకుండా విష్ణు శ్రీను వైట్ల కాంబోలో రాబోతోన్న డబుల్ డోస్ సినిమాలోనూ ప్రగ్యా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











