twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉన్నత చదువుల కోసం సాయం.. ప్రకాష్ రాజ్ మంచి మనసు!

    |

    విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలను పోషించి.. అందరి మనసులను గెలచుకున్నాడు. అయితే తెరపై ఎంత గొప్ప పాత్రలను పోషించాడో.. నిజ జీవితంలోనూ అంతే గొప్ప ఆలోచనలు కలవాడు. లాక్డౌన్ సమయంలో తన ఫాంహౌస్‌లో పని చేసే శ్రామికులను ఎంత బాగా చూసుకున్నాడో అందరికీ తెలిసిందే. బయటకు తెలియన గుప్త దానాలెన్నో చేస్తుంటాడు. తాజాగా ప్రకాష్ రాజ్ ఓ పేద అమ్మాయికి ఉన్నత చదువుల కోసం సాయం చేశాడు.

    ప్రకాష్ రాజ్ ఇప్పటికే తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక విద్యార్థినికి మాస్ట‌ర్స్ డిగ్రీ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయాన్ని చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. ప‌శ్చిమ గోదావ‌రికి జిల్లాకు చెందిన సిరిచంద‌న చిన్నతనం నుంచి అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌నప‌రుస్తూ బీఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేసింది. ఆమెకు మాంచెస్ట‌ర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి సీటు వ‌చ్చింది. ఆమెకు తండ్రి లేడు. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రం. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఆశ‌లు వ‌దిలేసుకున్న ఆమె పాలిట ఆప‌ద్బాంధ‌వుడ‌య్యాడు ప్ర‌కాష్‌రాజ్‌.

     Prakash Raj helps West Godavari student to pursue overseas studies

    హైద‌రాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ప్ర‌కాష్‌రాజ్‌ను క‌లుసుకొని, త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆమెను బాగా చ‌దువుకొని, వృద్ధిలోకి రావాల్సిందిగా ప్ర‌కాష్‌రాజ్ ఆశీర్వ‌దించాడు.
    ఈ సంద‌ర్భంగా సిరిచంద‌న మాట్లాడుతూ, "నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మా నాన్న‌గారు చ‌నిపోయారు. అప్ప‌ట్నుంచీ మా అమ్మే క‌ష్ట‌ప‌డి మ‌మ్మ‌ల్ని చ‌దివించి ఇక్క‌డి దాకా తీసుకువ‌చ్చింది. యూనివ‌ర్సిటీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డికి వెళ్ల‌డానికి నేను ధైర్యం చెయ్య‌లేదు. ఎందుకంటే ఆర్థికంగా మా కుటుంబం ప‌రిస్థితి నాకు తెలుసు కాబ‌ట్టి. న‌రేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒక‌రు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన‌ప్పుడు, ప్ర‌కాష్‌రాజ్ గారు అదిచూసి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. అన్ని ఖ‌ర్చులు ఆయ‌నే భ‌రిస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రేర‌ణ‌తో నేను బాగా చ‌దువుకొని, నాలాంటి స్థితిలో ఉన్న మ‌రో న‌లుగురికి సాయం చేయాల‌ని అనుకుంటున్నా. నిజానికి మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్ర‌కాష్‌రాజ్ గారు ఇచ్చిన స‌పోర్ట్ ఎన్న‌టికీ మ‌ర్చిపోలేం. బుక్స్ ద‌గ్గ‌ర్నుంచి కంప్యూట‌ర్ దాకా ఆయ‌నే స‌మ‌కూర్చి పెట్టారు. క‌చ్చితంగా ఈ విష‌యంలో ఆయ‌న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటాను. ఎప్ప‌టికీ ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాన'ని చెప్పింది.

    English summary
    Veteran actor Prakash Raj is a man of words. Off the screen, he is a different person and believes in giving what life has given to him. During the pandemic lockdown, we have seen Prakash Raj taking care of the migrant labourers and now here is yet another tale of his helping nature
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X