twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీనికి అంతం లేదు.. కేజీయఫ్ ఫ్యామిలీపై ప్రశాంత్ నీల్

    |

    ఒకే ఒక్క సినిమా కన్నడ ఇండస్ట్రీ మొత్తానికి ప్రతినిధిగా మారింది. కేజీయఫ్ సినిమాతో శాండల్ వుడ్‌ను ప్రపంచం మొత్తం గుర్తించింది. ఇండియాలో కేజీయఫ్ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి తగ్గట్టే సీక్వెల్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మొదటి పార్ట్ క్రియేట్ చేసిన వండర్స్‌ను మించేలా చాప్టర్ 2 రెడీ అయింది. ఇప్పటికే వదిలిన టీజర్ ప్రపంచ రికార్డులను కొల్లగొట్టేసింది.

    కొంటె చూపులతో కవ్విస్తోన్న కోలీవుడ్ భామ అనన్యామణి ఫొటోలు

    వ్యూస్, లైక్స్ విషయంలో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్రానికి పని చేసిన వారంతా ఒకే చోటకు చేరారు. వీకెండ్ సందర్భంగా అందరూ ఇలా కలిసినట్టున్నారు. కేజీయఫ్ ఫ్యామిలీ అంటూ ప్రశాంత్ నీల్ షేర్ చేసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఇప్పుడు చాప్టర్ 2 మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

    Prashanth Neel about KGF Family Pic,

    అందరూ కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను షేర్ చేసిన ప్రశాంత్ నీల్.. ఎంతో గొప్పగా ప్రారంభమైన ఈ ప్రయాణానికి అంతం ఎప్పుడూ ఉండదు.. అని చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో చిత్ర నిర్మాత, హీరో యశ్, అతని ఫ్యామిలీ, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ రచ్చచేశారు. ప్రస్తుతం నెట్టింట్లో కేజీయఫ్ ఫ్యామిలీ పిక్స్ అంటూ ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

    English summary
    Prashanth Neel about KGF Family Pic,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X