HanuMan: హనుమాన్ మూవీలో బహుబలి రేంజ్ ట్విస్ట్... ఏంటో తెలుసా?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సూపర్ హీరో మూవీ 'హనుమాన్'. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా ఈ మూవీలో నటించారు. ఇక ఈ మూవీ జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు... పలు విదేశీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో బహుబలి రేంజ్ ట్విస్టు ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Recommended Video

సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు నిలిచాయి. అందులో చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ ఒకటి. సినిమా చిన్నదైనా... బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం వెరే లెవెల్ అని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. రామ భక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే.. ఆ కథ ఎలా ఉంటుందో అనే కథాంశంతో ఈ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించారని ప్రేక్షకులు అంటున్నారు.

హిందూ పురాణాలను టచ్ చేసినా.. ఎక్కడా లైన్ దాటకుండా అందరు అంగీకరించేలా తెరకెక్కించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సినిమాలోని గ్రాఫిక్స్ షాట్స్, VFX సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ అని నెట్టింట వైరల్ గా చేస్తున్నారు. మూవీలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఆ సీన్స్ వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా చివర్లో ఆంజనేయస్వామి షాట్స్ అయితే ఆడియన్స్ ని సీట్ లో కూర్చోనివ్వడం లేదని టాక్.
కాగా ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పుకువచ్చారు. ఈ సీక్వెల్ ని కూడా మూవీ ఎండ్ లోనే ప్రకటించారు. హనుమాన్ 2కి లీడ్ ఇస్తూ బాహుబలి లెవెల్ ట్విస్ట్ పెట్టారని సమాచారం. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడనే ట్విస్ట్ సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ చేసిందని తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ పెట్టారని సినిమా చూసిన వారికి అర్థం అవుతుంది.

ఇక ఈ సీక్వెల్ కి 'జై హనుమాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రాన్ని 2025కి తీసుకు రాబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ జై హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం నార్త్ ఆడియన్స్ విపరీతంగా నచ్చినట్లు తెలుస్తోంది.
ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. తేజ సజ్జాకు జంటగా.. అమృత అయ్యర్ నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, గెటప్ సీను, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది.


Click it and Unblock the Notifications











