Priety Zinta Wink: కన్నుకొట్టి కవ్వించిన ప్రీతీ జింటా.. అలా సైగ చేసిందెవరికో తెలుసా?
బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా జాతీయ మీడియాలోను, మారిపోవడమే కాకుండా అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా జరిగిన చివరి క్వాలిఫయర్ మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్ జట్టుపై పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు విజయం సాధించడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మ్యాచ్ జరుగుతున్నంత సేపు హుషారుగా, జోష్‌తో ఉత్సాహం కనిపించిన అందాల భామ మ్యాచ్ అనంతరం చేసిన ఓ సైగ అందర్నీ బుట్టలో పడేసేలా చేసింది. ప్రీతి జింటా కనుసైగ చేసిన విధం ఎలా ఉందంటే?
ఐపీఎల్ 2025 టోర్నీలో ఆరంభం నుంచి ప్రీతి జింటా సహ భాగస్వామి అయిన పంజాబ్ జట్టు (PBKS) జట్లు సవాళ్లను అధిగమిస్తూ ఒంటరిపోరాటం చేసింది. అయితే మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అనూహ్యంగా ఓటమి చెందడంతో ఆ జట్టును అభిమానించే వారంతా డీలా పడిపోయారు. తమ జట్టు అభిమానులను ఏ మాత్రం నిరాశ చెందనివ్వకుండా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఓటమి తర్వాత మాట్లాడుతూ.. ఈ పోరాటంలో ఓడిపోయాం. కానీ ఈ యుద్ధంలో మాత్రం కాదు అంటూ మనో నిబ్బరాన్ని నింపిన తీరు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.

Image Credit: Twitter
ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన రెండో క్వాలిఫయర్‌లో ముంబై జట్టుతో ఆట క్లిష్టమైన సమస్యగా మారింది. అయితే తొలి బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్లు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్కోరు బోర్డుపై భారీ లక్ష్యం ఉంచి పంజాబ్ జట్టుకు ముంబై సవాల్ విసిరారు. అయితే 204 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్‌కు సిద్దమైంది.
అయితే పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్ వికెట్లు టపటప రాలిపోయాయి. దాంతో బ్యాటింగ్ భారమంత శ్రేయాస్ అయ్యర్‌పైనే పడింది. శ్రేయాస్‌కు జతగా కలిసిన నేహల్ వధేరా స్కోరు బోర్డుపై పరుగుల వేట మొదలుపెట్టారు. స్కోరును చకచకా పరుగులు పెట్టించారు. దాంతో పంజాబ్ జట్టుకు విజయం సులభమైంది. శ్రేయాస్ 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేహల్ కూడా అదే జోష్‌తో 29 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు.
అయితే శ్రేయాస్, వధేరా కలిసి ఆడుతున్నంత సేపు ప్రీతి జింటా ఉత్సాహానికి అదుపులేకుండా పోయింది. సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పడల్లా చిన్న పిల్లాల మాదిరిగా గెంతులు వేసింది. జట్టు ఓనర్ అనే విషయాన్ని మరిచిపోయి.. క్రికెట్ అభిమానిగా ముఖ్యంగా పంజాబ్ ఫ్యాన్స్‌గా మారిపోయింది. తన జట్టుకు కొండంత అండగా నిలిచి మానసిక స్తైర్యాన్ని అందించింది. జట్టు విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ కనిపించింది.
Video Credit: Twitter
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్‌కు చేరింది. అయితే గతంలో మాత్రం కప్ కొట్టలేకపోయింది. తాజాగా ఐపీఎల్ కప్‌ను కొట్టేందుకు ఉవ్విలూరుతున్నది. ఈ ఆనందంలో మ్యాచ్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రీతీ జింటా కొండంత ఆనందంలో కనిపించింది. తన జట్టు సభ్యుల్లో ఒకరిని చూసి స్టయిల్‌గా కన్ను కొట్టి సైగ చేయడం కెమెరాలు బంధించాయి. ఆ సైగ చేసింది ఏ పంజాబ్ ఆటగాడికి అనేది అతడు కనిపించకపోవడంతో సస్పెన్స్‌గా మారింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











