ప్రియా వారియర్ లిప్‌లాక్ వైరల్.. ఆ హీరోకు షాక్..!

Recommended Video

Priya Prakash Varrier Lip Lock Photos Going Viral

ఒకే ఒకసారి కన్నుకొట్టి సోషల్ మీడియా ప్రపంచంలో పాపులరైన ప్రియా ప్రకాశ్ వారియర్ డైరెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఆమె నటించిన ఒరు అడార్ లవ్ చిత్రం దక్షిణాదిలోని నాలుగు భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రియా వారియర్ లిప్‌లాక్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా భారీ సినిమాలకు గట్టిపోటీగా నిలిచిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

హీరో రోషన్‌తో లిప్‌లాక్

హీరో రోషన్‌తో లిప్‌లాక్

లవర్స్ డే సినిమాకు సంబంధించిన టీజర్‌లో కన్నుగీటి వింక్ గర్ల్‌గా ప్రియా వారియర్ పేరు సంపాదించుకొన్నది. తాజాగా చిత్ర హీరో రోషన్‌తో కలిసి చేసిన లిప్ లాక్ సీన్ మరింత వైరల్ అయింది. దాంతో మరోసారి ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. రణ్‌వీర్, కార్తీ సినిమాల కంటే ఇదే ఎక్కువగా సందడి చేస్తున్నది.

ఐఎండీబీలో టాప్‌గా

ఐఎండీబీలో టాప్‌గా

దేశవ్యాప్తంగా సినిమాలకు సంబంధించిన రేటింగ్‌ను నిర్ధారించే ఐఎండీబీ డేటాబేస్‌లో లవర్స్ డే సినిమా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొన్నది. రిలీజ్‌కు ముందే అత్యంత పాపులారిటీ సంపాదించుకొన్న చిత్రంగా 36 శాతం రేటింగ్‌ను సాధించడం గమనార్హం. దాంతో దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గల్లీ బాయ్ కంటే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించినట్లయింది.

36 శాతం మంది ఆసక్తిగా

36 శాతం మంది ఆసక్తిగా

అంతేకాకుండా దేశంలోనే అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రంగా ఓరు అడార్ లవ్ చిత్రం ప్రత్యేక అటెన్షన్‌ను క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా 36 శాతం మంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టమంది. ఇదంతా కేవలం ప్రియా వారియర్ వల్లే సాధ్యమైందనే మాట చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది.

 ఫిబ్రవరి 14 తేదీన రణ్‌వీర్ వర్సెస్ ప్రియా

ఫిబ్రవరి 14 తేదీన రణ్‌వీర్ వర్సెస్ ప్రియా

ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హిందీలో రణ్‌వీర్ సింగ్ నటించిన గల్లీ భాయ్, తమిళ హీరో కార్తీ నటించిన దేవ్ చిత్రాలు రిలీజ్‌కు ముస్తాబవుతున్నాయి. ఈ టాప్ హీరోల రెండు సినిమాలకు సోలోగా ప్రియా వారియర్ గట్టి పోటీ ఇస్తున్నదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

 గల్లీబాయ్‌గా రణ్‌వీర్ సింగ్

గల్లీబాయ్‌గా రణ్‌వీర్ సింగ్

గల్లీబాయ్‌ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ర్యాపర్‌గా కనిపించబోతున్నాడు. ఇక తమిళ చిత్రం దేవ్‌లో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించింది. వినూత్నమైన కథాంశంతో దేవ్ చిత్రం తెరకెక్కింది. రిలీజ్ తర్వాత ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X