twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శర్వానంద్‌ను అలా చూసి షాక్.. ఒక్కసారైనా వెళ్లాలి.. శ్రీకారం హీరోయిన్ కామెంట్స్

    |

    శర్వానంద్ నటన, అతని స్వభావం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై ఎంత హుందాగా, ఒదిగిపోయి కనిపిస్తాడో తెర వెనుకా అంతే పద్దతిగా ఉంటాడు. అయితే శర్వానంద్‌కు గత కొన్ని రోజులుగా సరైన హిట్ రావడం లేదు. ఎన్ని రకాల పాత్రలను పోషించినా, కొత్త కథలను ఎంచుకున్నా కూడా హిట్ మాత్రం పడటం లేదు. అందుకే ఈ సారి రైతులు, పల్లె వాతావరణాన్ని ఎంచుకున్నాడు. శ్రీకారం అంటూ కొత్త పంథాకు శ్రీకారం చుట్టేందుకు వచ్చాడు.

    టైటిల్‌తోనే..

    టైటిల్‌తోనే..

    శ్రీకారం అనే టైటిల్‌తోనే సినిమాపై అందరికీ మంచి అభిప్రాయాన్ని కలిపించేశారు. అలా శర్వానంద్ శ్రీకారంపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ, శర్వానంద్ గురించి చెబుతూ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కొన్ని విషయాలను బయటపెట్టేసింది.

    ఆ సినిమాతో..

    ఆ సినిమాతో..

    ప్రియాంక అరుల్ మోహన్ నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్‌గా అంతగా వర్కవుట్ అవ్వలేదు. కానీ ప్రియాంక అందాలకు మాత్రం అందరూ ఫిదా అయ్యారు. అలా శ్రీకారం సినిమాలో అవకాశం కొట్టేసింది. అయితే తాజాగా శర్వానంద్ క్యారెక్టర్ గురించి ఎంతో గొప్పగా చెప్పింది.

    అలా చూసి షాక్..

    అలా చూసి షాక్..

    శ్రీకారం సినిమాలో శర్వానంద్ రైతుగా కనిపించబోతోన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిజ జీవితంలోనూ శర్వానంద్ ఓ రైతేనట. హైద్రాబాద్ పరిసర ప్రాంతాలో శర్వానంద్‌కు ఓ ఫాం హౌస్ ఉందట. అందులో శర్వానంద్ వ్యవసాయం చేస్తాడట. మట్టిలో ఉంటూ వ్యవసాయం చేసిన శర్వానంద్‌ను చూసి షాక్ అయిందట.

    ఒక్కసారైనా వెళ్లాలి..

    ఒక్కసారైనా వెళ్లాలి..

    అయితే శర్వానంద్ ఫాం హౌస్ ఫోటోలు, ఆయన పని చేసి తీరుని ఫోటోల్లోనే చూశాను.. ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలి.. చూడాలిన ఆశపడుతున్నా అంటూ తన మనసులో కోరికను ప్రియాంక బయటపెట్టేసింది. అయితే శ్రీకారం సినిమాలోని పాత్ర శర్వానంద్‌కు కొత్తేమీ కాదని తెలిసిపోతోంది.

    సమ్మర్ కానుకగా..

    సమ్మర్ కానుకగా..

    14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేసవిలో విడుదల కాబోతోన్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీకారం మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Priyanka Arul mohan Comments On Sharwanand..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X